రాగి పాత్రలో నీరు తాగే అలవాటు ఉందా..? అయితే ఈ తప్పులు చేయకండి..!

[ad_1]

copper vessel water: రాగి పాత్రలోని నీరు ఆరోగ్యానికి మేలు చేస్తాయని మనకు తెలుసు. రాగి పాత్రలోని పోషకాలు నీటిలోకి చేరి.. అవి శరీరంలోని ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియాతో పోరాడి ఎలాంటి అనారోగ్యాలు రాకుండా రక్షిస్తాయి. రాగిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల.. లివర్‌, కిడ్నీల పనితీరు మెరుగుపడి శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. బరువు తగ్గాలనుకునేవారు రాగిపాత్రలో నీరు తాగితే మంచిది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును విచ్ఛిన్నం చేసే గుణాలు కాపర్‌లో అధికంగా ఉంటాయి. మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయులు తగ్గి బీపీ, హార్ట్‌బీట్ అదుపులో ఉండాలన్నా, గుండె జబ్బులకు దూరంగా ఉండాలన్నా అది కాపర్ వల్లే సాధ్యమవుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ వెల్లడించింది. రాగి పాత్రలో నీరు తాగడం వల్ల ప్రయోజనాలు తెలుసుకుని ప్రస్తుతం చాలా మంది రాగి బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారు. ఆఫీసులకు, పాఠశాలలకు.. కాపర్‌ బాటిల్స్‌ క్యారీ చేస్తున్నారు.
ప్రముఖ పోషకాహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా రాగి బాటిల్‌/పాత్రలో ఉంచిన నీటిని సరైన పద్ధతిలో తాగితేనే.. శరీరానికి మేలు జరుగుతుందని అన్నారు. రాగి పాత్ర/ సీసాలో నీరు తాగే అలవాటు ఉంటే.. 3 రకాల తప్పులను నివారించాలని సూచించారు. లేకపోతే.. దష్ప్రభావాలు ఎదుర్కోవలసి వస్తుందని అన్నారు.

రోజంతా.. ఆ నీళ్లే తాగొద్దు..

రోజంతా.. ఆ నీళ్లే తాగొద్దు..

మీరు రోజంతా రాగి సీసాలో/ పాత్రలో నిల్వ ఉంచిన నీళ్లు తాగుతుంటే.. కాపర్‌ టక్సిసిటీ అయ్యే ప్రమాదం ఉందని కిరణ్ కుక్రేజా అన్నారు. దీని కారణంగా.. వికారం, మైకం, కడుపు నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లివర్‌, కిడ్నీల వైఫల్యానికి దారితీస్తుంది. రాగి అధిక మొత్తంలో నీటిలో చేరితే.. అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఇవి కలపొద్దు..

ఇవి కలపొద్దు..

చాలా మంది.. ఆరోగ్యానికి మంచిదనే ఉద్దేశంలో ఉదయాన్నే ఖాళీ కడుపుతో నిమ్మరసం, తేనె కలిపిన నీళ్లు తాగుతుంటారు. కానీ, రాగి పాత్ర/సీసాలో నిల్వ ఉంచిన నీటిలో నిమ్మరసం, తేనె మిక్స్ చేసుకుని తాగకూడదని కిరణ్ కుక్రేజా అన్నారు. నిమ్మరసంలోని యాసిడ్‌.. కాపర్‌తో రియాక్ట్‌ అవుతుంది. దిని కారణంగా.. కడుపు నొప్పి, ఎసిడిటీ, వాంతులు అవుతాయి.

కాపర్‌ బాటిల్‌ను రోజు శుభ్రం చేయవద్దు..

కాపర్‌ బాటిల్‌ను రోజు శుభ్రం చేయవద్దు..

రాగి పాత్రలను రోజూ శుభ్రం చేయకూడదని కిరణ్ కుక్రేజా అన్నారు. రోజూ బాటిల్‌ శుభ్రం చేస్తే.. దానిలోని ప్రయోజనకరమైన లక్షణాలు తగ్గుతాయి. రోజూ దాన్ని నీటోతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. నెలకొసారి ఉప్పు, నిమ్మరసం వేసి శుభ్రం చేసుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *