ఇవి తింటే.. స్ట్రెస్‌ క్షణాల్లో మాయం అవుతుంది

[ad_1]

Authored by Rajiv Saranya | Samayam Telugu | Updated: 9 Dec 2022, 11:25 am

Stress Control Food: వ్యక్తిగత, ఉద్యోగ, పిల్లలు, ఆర్థిక విషయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. మానసిక ఒత్తిడి భావోద్వేగాల మీదే కాదు, శరీరం మీదా విపరీత ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌, అధిక బరువు, కుంగుబాటు, ఆందోళన, ఆస్థమా, మతిమరుపు వంటి సమస్యలకూ దారితీస్తుంది. స్ట్రెస్‌ తగ్గించడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం, మ్యూజిక్‌, డ్యాన్స్‌ వంటి పద్ధతులు చాలా సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారమూ.. ఒత్తిడి తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు.

 

Stress Control Food: ఈ బిజీబిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా అన్ని వయస్సుల వారికి స్ట్రెస్‌ లెవల్స్‌ బాగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత, ఉద్యోగ, పిల్లలు, ఆర్థిక విషయాల కారణంగా తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. కొన్ని సార్లు స్ట్రెస్‌తో ఇంట్లో వాళ్ల మీద అరిచేస్తూ ఉంటాం. కుటుంబ సభ్యులతో అనవసరం గొడవకు దిగుతూ ఉంటారు. ఒత్తిడి వల్ల ఆందోళనగా, దిగులుగా ఉంటుంది. మానసిక ఒత్తిడి భావోద్వేగాల మీదే కాదు, శరీరం మీదా విపరీత ప్రభావం చూపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్‌, అధిక బరువు, కుంగుబాటు, ఆందోళన, ఆస్థమా, మతిమరుపు వంటి సమస్యలకూ దారితీస్తుంది. ఒత్తిడితో అకాల వృద్ధాప్యం, అకాల మరణం ముప్పూ ముంచుకొస్తుందని అంటున్నారు. కాబట్టి స్ట్రెస్‌ను తగ్గించుకోవటం చాలా అవసరం. స్ట్రెస్‌ తగ్గించడానికి యోగా, ప్రాణాయామం, ధ్యానం, మ్యూజిక్‌, డ్యాన్స్‌ వంటి పద్ధతులు చాలా సహాయపడతాయి. మనం తీసుకునే ఆహారమూ.. ఒత్తిడి తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.

ఒత్తిడి అంటే..

ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ప్రమాదం జరిగినప్పుడు.. మెదడులోని హైపోథాలమస్‌ రియాక్ట్‌ అయ్యి నాడీ వ్యవస్థ ద్వారా అడ్రినల్‌ గ్లాండ్‌ యాక్టివ్‌ అవుతుంది. దీంతో అడ్రినలిన్‌, కార్టిసోల్‌ హార్మోన్లు విడుదలవుతాయి. దీనివల్ల గుండెవేగం, శ్వాసవేగం, బీపీ పెరుగుతాయి. ప్రమాదాన్ని ఎదుర్కొనడానికి, మన బాడీలో ఉన్న నేచ్యురల్‌ ఏర్పాటు. ఎప్పుడో ఒకసారి కొద్ది స్థాయిలో ఎదురయ్యే ఇలాంటి ఒత్తిడి ప్రతిస్పందనలను శరీరం బాగానే తట్టుకుంటుంది. తట్టుకోలేని స్థాయిలో ప్రతిస్పందనలు తరచుగా కలుగుతూనే ఉన్నప్పుడు సమస్య వస్తుంది.

పచ్చి కూరగాయలు..

పచ్చి కాయగూరలు, పండ్లు, ఆకుకూరల్లో ఒత్తిడితో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఓ అధ్యయనం వెల్లడించింది. వీటిలో ఎక్కువగా ఉండే మెగ్నీషియం శరీరంలో కార్టిసాల్‌ (ఒత్తిడి హార్మోన్‌) స్థాయుల్ని తగ్గించి.. బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది. మీరు పచ్చి కూరగాయలను, పండ్లను సలాడ్స్‌, జ్యూస్‌ రూపంలో తీసుకుంటే.. మీ స్ట్రెస్‌ లెవల్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

​డైరీ ఉత్పత్తులు..

పాలు ఒత్తిడిని దూరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే.. లాక్టియమ్‌ అనే ప్రొటీన్‌ ఒత్తిడితో పోరాడే శక్తిని శరీరానికి ఇస్తుంది. దీని వల్ల బీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. రోజు నిద్రపోయే ముందు పాలు తాగితే హాయిగా నిద్రపడుతుంది. సోయా పాలు తాగే వారికి దీని ద్వారా క్యాల్షియం, పొటాషియం, ‘ఎ’, ‘డి’ విటమిన్లు, ప్రొటీన్లు తగినంత లభిస్తాయి.

సిట్రస్‌ పండ్లు..

సిట్రస్‌ పండ్లలో విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించే ‘సి’ విటమిన్‌ ఒత్తిడిని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సిట్రస్‌ పండ్లు తింటే.. కార్టిసాల్‌ హార్మోన్‌ స్థాయిలు తగ్గుతాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన దూరం అవుతుంది. మీ డైట్‌లో ఆరెంజ్‌, నిమ్మకాయ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు చేర్చుకోండి.

చేపలు..

చేపలు తరచుగా తింటే.. స్ట్రెస్‌ లెవల్స్‌ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, విటమిన్‌ డీ ఒత్తిడి తగ్గిస్తాయి.

తృణధాన్యాలు..

బ్రౌన్‌ రైస్‌, ఓట్‌మీల్‌, గోధుమ బ్రెడ్‌, కాయధాన్యాలు.. వంటివి మీ డైట్‌లో తీసుకుంటే ఒత్తిడి మాయం అవుతుంది. ఇవి తరచుగా తీసుకుంటే మెదడులో ఎండార్ఫిన్లు (హ్యాపీ హార్మోన్లు) విడుదల అవుతాయి. ఇవి ఒత్తిడితో పోరాడతాయి. ఇవి సెరటోనిన్‌ అనే మరో హార్మోన్‌ని విడుదల చేస్తాయి, దీంతో స్ట్రెస్‌ మాయం అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *