Work From Home: ఐటీ ఉద్యోగులకు శుభవార్త.. వర్క్ ఫ్రమ్ హోమ్ రూల్స్ మారాయ్..

[ad_1]

కేంద్రం ప్రకటన..

కేంద్రం ప్రకటన..

కంపెనీల నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ.. వారికి వర్క్ ఫ్రమ్ హోన్ విధానంలో పనిచేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా గురువారం అనుమతినిస్తూ ప్రకటన చేసింది. దీని ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న సెజ్ లలో ఉన్న ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులకు 100 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యాన్ని అనుమతిస్తూ గడువును డిసెంబర్ 2023 వరకు పొడిగించింది. ఇది ఐటీ కంపెనీలకు కొన్ని షరతుల మేరకు అనుమతించబడింది.

అనుమతులు..

అనుమతులు..

సెజ్ లోని ఏదైనా కంపెనీ తన ఉద్యోగులను ఇంటి నుంచి లేదా వారికి నచ్చిన ఇతర ప్రదేశం నుంచి పనిచేయటానికి అనుమతించవచ్చని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటనలో తెలిపింది. తాత్కాలిక ఉద్యోగులు, ఆఫ్‌సైట్ ఉద్యోగులు, ట్రావెలింగ్ ఉద్యోగులకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని నోటిఫికేషన్లో వెల్లడించింది. కంపెనీలు ఉద్యోగులను ఆఫీసులకు రప్పించేందుకు అస్టకష్టాలు పడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వ ప్రకటన కంపెనీలకు కొత్త సమస్యగా మారనుందని తెలుస్తోంది.

హైబ్రిడ్ విధానం..

హైబ్రిడ్ విధానం..

ఐటీ సేవల రంగంలో ఉన్న కంపెనీలు చాలా వరకు ప్రస్తుతం హైబ్రిడ్ విధానంలో 2-3 రోజులు కార్యాలయానికి రప్పిస్తున్నాయి. అయితే నగరాల్లో విపరీతంగా ఉండే ట్రాఫిక్, రవాణా ఖర్చులు, సమయం వృధా కావటం వంటి కారణాలను టెక్కీలు ఎక్కువగా ఎత్తిచూపుతున్నారు. అందుకే చాలా టెక్ కంపెనీలు చిన్న కార్యాలయాలను ఉద్యోగులకు దగ్గరగా చిన్న కార్యాలయాలతో పాటు టైర్-2,3 నగరాల్లో ఏర్పాటు చేస్తున్నాయి.

పని సాఫీగా జరిగేందుకు..

పని సాఫీగా జరిగేందుకు..

ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ సాఫీగా సాగేలా చూసేందుకు అవసరమైన ల్యాప్ టాప్, డెస్క్ టాప్ లతో పాటు ఇతర సామాగ్రి గురించి తన నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వం పూర్తి వివరాలను అందించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *