US Recession: మాంద్యంపై ఎలాన్ మస్క్ వార్నింగ్.. అలా చేయెుద్దంటూ ట్వీట్.. వచ్చే వారం..

[ad_1]

అమెరికాలో దుస్థితి..

అమెరికాలో దుస్థితి..

మాంద్యం ఇప్పటికే అమెరికా, యూరప్ తో పాటు మరికొన్ని దేశాలను ఆవరించింది. దీంతో అమెరిగా దిగ్గజ కంపెనీల్లో ఆర్థిక కల్లోలం తారా స్థాయిలకు చేరుకోవటంతో చాలా కంపెనీలు ఉద్యోగులను పీకేస్తూ.. వారి వ్యాపార ప్రణాళికలను మార్చుకుంటున్నాయి. అలా చాలా కంపెనీలు కొన్ని వ్యాపారాలను ఇప్పటికే మూసివేశాయి. అయితే ఇవి మరింత తీవ్రతరం అవుతాయా అనే అనుమానాలు చాలా మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

కొత్త గణాంకాలు..

అమెరికాలో టోకు ద్రవ్యోల్బణంపై తాజా గణాంకాలు వెలువడ్డాయి. వీటి ప్రకారం గత నవంబర్‌లో టోకు ద్రవ్యోల్బణం 7.4 శాతానికి తగ్గింది. టోకు ద్రవ్యోల్బణం తగ్గడం ఇది వరుసగా ఐదో నెల కావటం కొంత ఊరటను ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ రానున్న వారంలో ఏం నిర్ణయం తీసుకుంటుంది అన్నదే. దీనిపై ఇన్వెస్టర్ల నుంచి అమెరికన్ వ్యాపారవేత్తలు, సామాన్యులు, నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.

ఫెడ్ బాంబులు..

ఫెడ్ బాంబులు..

గడచిన కొన్ని నెలలుగా అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వరుసగా భారీ వడ్డీ రేట్ల పెంపును అమలు చేస్తోంది. ఈ దూకుడుతో దారితప్పుతున్న ఆర్థికానికి కారణమైన ద్రవ్యోల్బణాన్ని అదుపుచేయాలని నిర్ణయించింది. పెంపులు అనివార్యమని గతంలో చెప్పినప్పటికీ.. దీనిపై తాజాగా ఎలాన్ మస్క్ తన భయాందోళనను వ్యక్తం చేశారు.

ఎందుకంటే వడ్డీ రేట్ల పెంపులు ఇప్పుడు కార్పొరేట్ రంగంలోని కంపెనీలపై తీవ్ర ఒత్తిడిని పెంచటమే కారణంగా ఉంది. వచ్చే వార్ జరగనున్న అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ సమావేశం మళ్లీ వడ్డీ రేట్లను పెంచితే మాంద్యం మరింత దారుణంగా మారుతుందని మస్క్ అభిప్రాయపడ్డారు.

ఉపశమనం ఉన్నప్పటికీ..

ఉపశమనం ఉన్నప్పటికీ..

ఈ ఏడాది మార్చిలో అమెరికాలో టోకు ద్రవ్యోల్బణం గరిష్ఠంగా 11.7 శాతానికి చేరుకుంది. కానీ ఆ తర్వాత ఫెడ్ గట్టి చర్యల వల్ల క్రమంగా 5 నెలలుగా ఇది తగ్గుతూ వచ్చింది. అయితే ఈ సమయంలో వడ్డీ రేట్లను తగ్గిస్తే మళ్లీ ద్రవ్యోల్బణం అదుపుతప్పవచ్చని కొందరు భావిస్తున్నారు. అందుకే ఈ సమావేశంలో సైతం ఫెడ్ ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యల్లో భాగంగా వడ్డీ రేట్ల పెంపుకు మెుగ్గుచూపుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇటు భారత రిజర్వు బ్యాంక్ సైతం రేట్లను పెంచినప్పటికీ ఆ వేగాన్ని నెమ్మదింపజేసింది. ఫెడ్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయ్యే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అదే సమయంలో నెలవారీ ప్రాతిపదికన అమెరికా నిర్మాత ధర సూచిక అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో 0.3 శాతం పెరిగింది. ఈ సూచీ పెరగడం ఇది వరుసగా మూడో నెల కొనసాగింది. ఈ సూచిక వినియోగదారులకు చేరే ముందు ఉత్పత్తి ధర గురించి చెబుతుంది.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *