[ad_1]
మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 2.47 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ సూచీ 101 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 102 పాయింట్లు నష్టపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 164 పాయింట్ల లాభంలో ఉంది.
ఎదురుచూస్తున్న ఇన్వెసెట్టర్లు..
ఈ రోజు మార్కెట్లో సూచీలు కొంత స్ధబ్దుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా నేడు ప్రభుత్వం డిసెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన జీడీపీ గణాంకాలను నేడు భారత ప్రభుత్వం విడుదల చేయనుంది. మార్కెట్ వర్గాలు ఈ వివరాల కోసం నిశితంగా వేచి చూస్తున్నారు.
పొంచి ఉన్న ప్రమాదం..
భారత బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు భారీగా పెరిగింది. రిజర్వు బ్యాంక్ తన వడ్డీ రేట్లను క్రమంగా పెంచుతూ పోతున్న తరుణంలో 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ కర్వ్ ఇన్వెర్ట్ అయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇదే విషయాన్ని క్వాంటమ్ అసెట్ మేనేజ్‌మెంట్, ఫిక్స్‌డ్ ఇన్కమ్ ఫండ్ మేనేజర్ పంకజ్ పాఠక్ వెల్లడించారు.
టాప్ గెయినర్స్..
అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, బ్రిటానియా, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.
టాప్ లూజర్స్..
సిప్లా, హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, రిలయన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, యూపీఎల్, బజాజ్ ఫైనాన్స్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, విప్రో, బీపీసీఎల్, ఎల్ అండ్ టి కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
[ad_2]
Source link
Leave a Reply