అలర్టైన ఆర్థిక మంత్రి Nirmala Sitharaman.. ప్రభుత్వ బ్యాంకులకు హెచ్చరికలు..!

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Nirmala Sitharaman: అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, యూరప్ కు చెందిన క్రెడిట్ సూయిస్‌లతో పాటు మరికొన్ని బ్యాంకులు కుప్పకూలటం ప్రపంచాన్ని ప్రస్తుతం కుదిపేస్తోంది. ఇవి అమెరికా, యూరప్ బ్యాంకింగ్ వ్యవస్థలో అధిక అస్థిరతకు కారణాలుగా మారాయి. అయితే ఆ ప్రభావం ఆసియా ఖండంలోని అనేక వృద్ధి చెందుతున్న దేశాలపై కూడా ఉంది.

ఈ క్రమంలో దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రతినిధులతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో రిస్క్ మేనేజ్‌మెంట్, డిపాజిట్ల డైవర్సిఫికేషన్, ఆస్తుల ఆధారంపై దృష్టి సారించడం ద్వారా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌కు కట్టుబడి తగిన శ్రద్ధతో పాటు సంసిద్ధతపై సీతారామన్ చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కిషన్‌రావ్ కరాడ్, ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి, పీఎస్‌బీల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అలర్టైన ఆర్థిక మంత్రి Nirmala Sitharaman.

ఈ క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు ఒత్తిడి పాయింట్లను గుర్తించటంతో పాటు అధిక రిస్క్, ప్రతికూల ఎక్స్‌పోజర్‌లను నిశితంగా పరిశీలించాలని సూచించారు. ఒకవేళ నిజంగా సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వచ్చినప్పటికీ ఎలా ముందుకు సాగాలో వ్యూహాలను రూపొందించడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్మలమ్మ కోరారు. ఇందుకోసం వారు అత్యుత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, రెగ్యులేటరీ నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించారు.

గ్లోబల్ బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న పరిణామాలపై తాము అప్రమత్తంగా ఉన్నామని, ఏదైనా సంభావ్య ఆర్థిక షాక్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని PSBలు తెలిపాయి. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ మంచి స్థితిలో ఉందని నిపుణులు, విధాన నిర్ణేతలు చెబుతుండగా.. ద్రవ్యోల్బణ కట్టడిలో భాగంగా ద్రవ్య కఠినతను రిజర్వు బ్యాంక్ పెంచుతున్నప్పటికే దానివల్ల ఏర్పడే పరిస్థితులను నిర్వహించగలరని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో దేశంలోన్ని అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఏకీకృత లాభం రూ.66,543 కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో ఇది రూ.70,167 కోట్లకు పెరిగింది.

English summary

Union Finance minister Nirmala sitharaman cautioned PSB’s amid America, Europe banking Crisis

Union Finance minister Nirmala sitharaman cautioned PSB’s amid America, Europe banking Crisis

Story first published: Sunday, March 26, 2023, 20:09 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *