[ad_1]
కిడ్నీల ఆరోగ్యం..
అల్లం..
అల్లం.. ఆహారం టేస్ట్‌ను పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షిస్తుంది. అల్లంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గూణాలు కిడ్నీల వాపు, నొప్పిని తగ్గించడంలో సహాయపడుతాయి. అల్లంలోని ఔషధ గుణాలు కిడ్నీలను ఫిల్టర్ చేస్తాయి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. తరచుగా అల్లం టీ తాగడం మంచిది. (image source – pixabay)
పసుపు..
పసుపు ప్లాస్మా ప్రోటీన్లను మెరుగుపరుస్తుంది, టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్‌లో సీరం యూరియా, క్రియేటినిన్ స్థాయిలను తగ్గిస్తుంది. పసుపును మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు. పుసుపులోని యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు.. కిడ్నీ ఇన్ఫెక్షన్లు, కిడ్నీ సమస్యలను దూరం చేస్తాయి.
Also read: ఆయుర్వేద మూలికలతో.. డయాబెటిస్‌కు చెక్..!
తిప్పతీగ..
తిప్పతీగ కిడ్నీల ఆరోగ్యానికి మేలు చేసే అద్భతమైన మూలిక అని చెప్పొచ్చు. ఇది శరీరాన్ని డీటాక్స్ చేసి.. మూత్రపిండాలపై భారాన్ని తగ్గిస్తుంది. తిప్పతీగ.. కిడ్నీల నుంచి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దీనిలోని ఆల్కలాయిడ్ అనే మూలకం ఉంది, మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. తిప్పితీగలోని యాంటీఆక్సిడెంట్స్ ప్రీ రాడికల్స్ కారణంగా కిడ్నీలు దెబ్బతినకుండా రక్షిస్తాయి. కిడ్నీ సమస్యతో బాధపడేవారు, కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు.. తిప్పతీగతో తయారు చేసి టీ తాగితే మంచిని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)
త్రిఫల..
త్రిఫలను ఉసిరి, కరక్కాయ, తానికాయతో తయారు చేస్తారు. దీన్లో యాంటీఆక్సిడెంట్స్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా గుణాలున్నాయి. ఇది శరీర ఆక్సిడేటివ్ స్ట్రెస్ (oxidative stress )ను తగ్గించడంలో సహాయపడుతుంది. త్రిఫల ప్లాస్మా ప్రోటీన్లు, అల్బుమిన్, క్రియాటినిన్‌లను మెరుగుపరుస్తుంది. త్రిఫల మూత్రపిండాలలోని వ్యర్థాలను తొలగిస్తుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే.. త్రిఫల తీసుకోవడం మంచిది.
Also Read: కిడ్నీలు బాగుండాలంటే.. ఈ జ్యూస్ కచ్చితంగా తాగాలి..!
డాండెలైన్ వేరు..
డాండెలైన్ వేరు.. మూత్రపిండాలను శుభ్రపరడంలో సహాయపడుతుంది. ఇది మూత్ర వ్యవస్థను బలోపేతం చేస్తుంది. తరచుగా డాండెలైన్ రూట్ టీ తాగితే.. కిడ్నీలలోని టాక్సిన్స్ తొలగుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply