[ad_1]
News
lekhaka-Bhusarapu Pavani
DreamX UPI: భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఈ వ్యాపార అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు అనేక మంది ఆటగాళ్లు ఈ రంగంలోని అడుగు పెడుతున్నారు. తాజాగా దేశంలోని అతిపెద్ద ఫాంటసీ స్పోర్ట్స్ సంస్థ డ్రీమ్11 మాతృ సంస్థ డ్రీమ్ స్పోర్ట్స్ ఈ రంగంలోనికి అడుగుపెట్టింది. తమ ప్లాట్‌ఫారమ్ లలో యూజర్లు గెలిచిన మెుత్తాన్ని చెల్లింపులకు వినియోగించుకునేందుకు వీలు కల్పించేందుకు DreamX పేరుతో యూపీఐ యాప్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.
కంపెనీ మార్చి 31న ప్రారంభం కానున్న IPL టోర్నమెంట్ 2023 ఎడిషన్‌కు ముందుగా వస్తోంది. IPL టోర్నమెంట్‌లు సాధారణంగా ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫారమ్‌లకు కీలకమైనవి, ఎందుకంటే అవి ఆటగాళ్ల నుంచి అత్యధిక వినియోగాన్ని చూసాయి. కంపెనీ తీసుకొస్తున్న తాజా చర్య వినియోగదారుకు సహాయపడతాయని కంపెనీ భావిస్తోంది. కంపెనీకి ఇప్పటికే చాలా మంది కస్టమర్లు ఉండటం యూపీఐ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లటానికి కలిసొస్తున్న అంశంగా ఉంది.
కంపెనీ సొంతంగా తన యూపీఐ చెల్లింపుల వ్యవస్థను మార్కెట్లోకి తీసుకురావటం వల్ల PhonePe, Google Pay, Paytm వంటి ప్రత్యర్థులకు పోటీదారుగా నిలవనుంది. ఈ క్రమంలో Dream11కు డిసెంబర్ 2022 నాటికి 160 మిలియన్ల యాక్టివ్ వినియోగదారులను కలిగి ఉందని పేర్కొంది. ప్రస్తుతం DreamX UPI యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ స్టోర్‌లో పబ్లిక్ బీటాలో అందుబాటులో ఉంది. యాప్ బంధువులకు, స్నేహితులకు డబ్బు బదిలీ చేయటం, QR కోడ్‌లను స్కాన్ చేయడం ద్వారా ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ కొనుగోళ్లకు చెల్లించడానికి వెసులుబాటు కల్పిస్తుంది.
ఇదే క్రమంలో వినియోగదారులు డ్రీమ్‌ఎక్స్ యాప్ ద్వారా విద్యుత్ చెల్లింపులు, నీటి బిల్లులు, బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్‌లైన్ బిల్లు వంటి యుటిలిటీ బిల్లులను చెల్లించడానికి లేదా గ్యాస్ సిలిండర్‌లను ఆర్డర్ చేయటం, మొబైల్ ఫోన్‌లు, DTH, ఫాస్ట్‌ట్యాగ్‌లను రీఛార్జ్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. డ్రీమ్‌ఎక్స్ తన యాప్ లిస్టింగ్‌లో పేర్కొన్న వారి క్రెడిట్ కార్డ్‌లు, లోన్‌లు, ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంలను కూడా చెల్లించుకునేందుకు వెసులుబాటును కల్పించింది.
English summary
Fantasy sports firm Dream11 Launched It’s UPI payments app DreamX amid IPL 2023 tournament
Fantasy sports firm Dream11 Launched It’s UPI payments app DreamX amid IPL 2023 tournament..
Story first published: Friday, March 31, 2023, 18:19 [IST]
[ad_2]
Source link
Leave a Reply