April 1: ఆ వస్తువుల ధరలు పెరిగాయి..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఏప్రిల్ 1 కొన్ని వస్తువుల ధరలు పెరిగింది. ఇటీవల సమర్పించిన కేంద్ర బడ్జెట్‌లో చాలా వస్తువులపై ట్యాక్స్ పెంచడంతో వాటి ధరలు పెరిగాయి. అలాగే పలు రకాల వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతం తగ్గించి 2.5 శాతం చేరింది. ఫలితంగా ఈ వస్తువుల ధరలు తగ్గాయి. ఈ వస్తువులలో మొబైల్ ఫోన్, కెమేరా, ఎల్ఈడీ టీవీ, బయోగ్యాస్ సంబంధిత వస్తువులు, ఎలక్ట్రిక్ కార్లు, ఆట వస్తువులు, హీట్ క్వాయిల్, డైమెండ్ జ్యువెల్లరీ,సైకిళ్లు ఉన్నాయి.

అయితే ఈ రోజు నుంచి బంగారం, వెండి, బంగారం-వెండితో తయారైన వస్తువులు, ప్లాటినం, ఇంపోర్టెడ్ డోర్స్, కిచెన్ చిమ్నీలు, విదేశీ ఆట వస్తువులు, సిగరెట్, ఎక్స్‌రే మిషన్ ధరలు పెరగనున్నాయి. నేటి నుంచి టాటా మోటార్స్, హీరో మోటో కార్ప్, మారుతి కంపెనీల కార్ల ధరలు పెరగనున్నాయి.

April 1: ఆ వస్తువుల ధరలు పెరిగాయి..

నేటి నుంచి కొత్త పన్ను విధానంలో రిబేట్ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచారు. ఇవాల్టి నుంచి డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు ఎలాంటి ఎల్‌టిసిజి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌కు పన్ను రాయితీలు ఉండవు వాటిని మీ ఆదాయం కింద లెక్కించి పన్ను విధిస్తారు. అది కూడా మీ స్లాబ్ అనుసారంగా ఉంటుంది. ఇప్పటి వరకు డెట్ ఫండ్స్‌పై వచ్చే ఆదాయాన్ని ఒకవేళ మూడేళ్లకు మించి యూనిట్లను కలిగి ఉంటే లాంగ్ టర్మ్‌గా భావించేవారు. ఇప్పటి వరకు ఎల్‌టిసిజికి ఇండెక్షేన్ తర్వాత 20 శాతంగా విధించేవారు.

సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్(ఎస్‌సిఎస్‌ఎస్) పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచారు. ఇది నేటి నుంచి అమలు కానుంది. ఇప్పటి వరకు ఈ పథకం కింద సంవత్సరానికి 8 శాతం వడ్డీ ఇచ్చేవారు. ఈ వడ్డీ ప్రతి మూడు నెలలకు ఓ సారి ఇస్తారు. పోస్టాఫీసు మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కింద పెట్టుబడి పరిమితిని రూ. 4.5 లక్షల నుంచి రూ. 9 లక్షలకు పెంచారు. ఒకవేళ అది జాయింట్ అకౌంట్ అయితే రూ. 9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు.

English summary

price increased from april 1 for various items

April 1 Prices of some items have increased. In the recently presented Union Budget, the prices of many items have gone up due to the increase in tax.

Story first published: Saturday, April 1, 2023, 12:32 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *