[ad_1]
Year Ender 2022: మన దేశంలో మహిళా పారిశ్రామికవేత్తలు అద్భుత విజయాలను అందుకుంటూ, తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 2022 సంవత్సరంలో చాలామంది మహిళామణులు వార్తల్లో ప్రముఖంగా నిలిచారు, ప్రపంచాన్ని ప్రభావితం చేశారు, మిలియనీర్లు & బిలియనీర్ల జాబితాల్లోకి ఎక్కారు.
గత 12 నెలల్లో మనల్ని ఆశ్చర్యపరిచిన మహిళా పారిశ్రామికవేత్తలు వీళ్లే:
శీతల్ కపూర్
SHR లైఫ్ స్టైల్స్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శీతల్ కపూర్. 40 ఏళ్ల వయస్సులో వ్యాపార ప్రయాణం ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రస్తుతం ₹400 కోట్ల టర్నోవర్‌తో ఉంది. తన భర్త సందీప్ కపూర్‌తో కలిసి, 2010లో భారతీయ మహిళల కోసం ఎత్నిక్ వేర్ సెగ్మెంట్‌ను ఆమె ప్రారంభించారు. ఆమె ప్రయాణం కేక్ వాక్ కాదు. తొలి మూడేళ్లలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కేవలం 10 స్టోర్లు ఓపెన్ చేశారు. ప్రస్తుతం ఈ నంబర్ సెంచరీ దాటింది. మొత్తం 500 స్టోర్‌లను ప్రారంభించే టార్గెట్‌తో పని చేస్తున్నారు.
ప్రీతి రాఠి గుప్తా
మహిళల కోసం మాత్రమే ఏర్పాటైన ఎకనమిక్ ఫ్లాట్‌ఫామ్ LXME స్థాపకురాలు ప్రీతి రాఠి గుప్తా. 17 సంవత్సరాల వయస్సులో తన కెరీర్‌ను ప్రారంభించారు. మహిళలు పురుషుల మీద ఆధారపడకుండా ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలన్న లక్ష్యంతో ఈ సంస్థను స్థాపించారు. ఉమెన్-ఫోకస్డ్ యాక్సిలరేటర్ ప్రోగ్రాం కింద Google ఇటీవల ఎంపిక చేసిన 20 ఇండియన్ స్టార్టప్‌లలో LXME ఒకటి.
News Reels
మసాబా గుప్తా
మసాబా గుప్తా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, యాక్టర్. ‘మసాబా మసాబా’ సీజన్ 2 కూడా నెట్‌ఫ్లిక్స్‌లో హిట్ అయింది. తన డిజైనర్ వేర్ కలెక్షన్స్‌తోనూ ఈమె వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణ వల్లనే ఈ రోజు తను ఈ స్థాయికి చేరుకున్నట్లు మసాబా ఎప్పుడూ చెబుతుంటారు.
సోమ మండల్, ఘజల్ అలఘ్ & నమిత థాపర్
పారిశ్రామికవేత్తలైన సోమ మండల్, ఘజల్ అలఘ్, నమిత థాపర్… ఫోర్బ్స్ ప్రకటించిన 20 మంది ఆసియా వ్యాపారవేత్తల జాబితాలో చోటు దక్కించుకుని భారతదేశానికి గర్వకారణంగా నిలిచారు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL) చైర్‌పర్సన్‌గా సోమ మండల్ పని చేస్తున్నారు. ఎమ్‌క్యూర్ ఫార్మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నమిత థాపర్ ఉన్నారు. ఘజల్ అలఘ్.. హన్సా కన్స్యూమర్‌కు కో-ఫౌండర్, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్. వీరు ముగ్గురూ వేల కోట్ల విలువైన కంపెనీలను నడుపుతున్నారు. తమ వ్యాపారాన్ని విపరీతంగా అభివృద్ధి చేయడంలో ముఖ్య పాత్ర పోషించినందుకు ఫోర్బ్స్ జాబితాలోకి వచ్చారు.
ఆకాంక్ష భార్గవ
కుటుంబ వ్యాపారమైన PM రిలొకేషన్స్‌లో (రవాణా సేవలు) ఆకాంక్ష భార్గవ కూడా ఒక భాగం. పురుషాధిక్య పరిశ్రమను ధిక్కరిస్తూ, నవంబర్‌లో ‘HerZindagiabout’ ప్రారంభించారు. ప్రారంభంలో, ఆమెను అండర్‌డాగ్ అని పిలిచేవాళ్లు. ఆ చిన్నచూపును రూపుమాపడానికి, తనను తాను నిరూపించుకోవడానికి శక్తికి మించి కష్టపడ్డారు. 16 సంవత్సరాల కృషి, అభిరుచి, పట్టుదల వల్ల ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరుకున్నారు.
అత్యంత ధనిక భారతీయ మహిళా వ్యాపారవేత్తలు
జులైలో, ఫల్గుణి నాయర్, సావిత్రి జిందాల్ ఫోర్బ్స్ సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో చేరారు. వాళ్ల వ్యక్తిగత సంపదలు బిలియన్ డాలర్లలో ఉన్నాయి. 17.7 బిలియన్ డాలర్ల ఆస్తితో సావిత్రి జిందాల్ 91వ స్థానంలో నిలిచారు. ప్రముఖ ఈ-కామర్స్ బ్యూటీ బ్రాండ్ Nykaaకి ఓనర్ అయిన ఫల్గుణి నాయర్ నికర విలువ 4.5 బిలియన్ డాలర్లు. రాధ వెంబు, కిరణ్ మజుందార్ షా, అను అగా, లీనా తివారీ కూడా ఫోర్బ్స్ సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో ఉన్నారు.
[ad_2]
Source link
Leave a Reply