కెనరా బ్యాంక్ కస్టమర్లకు కష్టకాలం, మరింత భారం మోయాల్సిందే!

[ad_1]

Canara Bank Hikes Interest Rates: కెనరా బ్యాంక్‌ రుణగ్రహీతలకు బ్యాడ్‌ న్యూస్‌. నిధుల వ్యయ ఆధారిత రుణ రేట్లను (Marginal Cost of Funds based Lending Rate లేదా MCLR) ఈ బ్యాంక్‌ పెంచింది. దీంతో, పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్ సహా వివిధ రుణాల మీద వడ్డీ రేటు పెరుగుతుంది. బ్యాంకు రుణ వడ్డీ రేటు 5 బేసిస్ పాయింట్లు లేదా 0.05 శాతం పెరిగింది. బుధవారం (12 ఏప్రిల్‌ 2023) నుంచి ఈ పెంపుదల అమలులోకి వచ్చింది.

కెనరా బ్యాంక్ MCLR 
కెనరా బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం.. ఒక రోజు లేదా ఓవర్ నైట్ MCLR 7.90 శాతానికి, ఒక నెల MCLR 8 శాతానికి, 3 నెలల MCLR 8.15 శాతానికి, 6 నెలల MCLR 8.45 శాతానికి, ఒక సంవత్సరం MCLR 8.65 శాతానికి పెరిగింది. మిగిలిన కాలాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదు.

MCLR విధానం కింద రుణాలు తీసుకున్న కస్టమర్ల మీద వడ్డీ రేట్ల పెంపు భారం పడుతుంది. తద్వారా, వాళ్లు తీసుకున్న రుణాల EMI (equated monthly installment) పెరుగుతుంది. 

ప్రభుత్వ రంగంలోని కెనరా బ్యాంక్‌ వడ్డీ రేట్లను పెంచితే.. ప్రైవేటు రంగంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ (HDFC Bank) తన నిధుల వ్యయం ఆధారిత రుణ వడ్డీ రేట్లను 85 బేసిస్‌ పాయింట్లు లేదా 0.85 శాతం వరకు తగ్గించింది. 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వడ్డీ రేట్లు: 
1 రోజు లేదా ఓవర్‌నైట్‌ MCLR 8.65 శాతం నుంచి 75 బేసిస్‌ పాయింట్లు లేదా 0.85 శాతం తగ్గి, 7.80 శాతానికి తగ్గింపు 
1 నెల కాల వ్యవధి MCLR  8.65 శాతం నుంచి 70 బేసిస్‌ పాయింట్లు లేదా 0.70 శాతం తగ్గి, 7.95 శాతానికి తగ్గింపు 
3 నెలల కాల వ్యవధి MCLR 40 బేసిస్‌ పాయింట్లు లేదా 0.4 శాతం తగ్గి, 8.30 శాతానికి తగ్గింపు
6 నెలల MCLR 8.80 శాతం నుంచి 10 బేసిస్‌ పాయింట్లు తగ్గి, 8.70 శాతానికి తగ్గింపు 
1 సంవత్సరం MCLR 8.95 శాతానికి తగ్గింపు 
2 సంవత్సరాల 9.05 శాతానికి తగ్గింపు 
3 సంవత్సరాల 9.15 శాతానికి తగ్గింపు 

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి.

సాధారణంగా, గృహ రుణం సహా చాలా రకాల రుణాలను MCLRకి లింక్ చేసి బ్యాంకులు మంజూరు చేస్తున్నాయి. 2016 ఏప్రిల్‌ 1వ తేదీ తర్వాతి నుంచి తీసుకున్న ప్రతి లోను దాదాపుగా MCLRతో అనుసంధానమై ఉంటుంది. కాబట్టి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI), తన రెపో రేటును పెంచిన ప్రతిసారీ బ్యాంకులు కూడా MCLRకి లింక్ చేసిన రుణాలపై రేట్లు పెంచుతూ ఉంటాయి. ఒకవేళ, రెపో రేటును RBI తగ్గిస్తే, బ్యాంకులు కూడా MCLRకి లింక్ చేసిన రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తుంటాయి. MCLRలో హెచ్చుతగ్గులను బట్టి, నెలవారీ వాయిదా చెల్లింపులు (EMIs) మారుతూ ఉంటాయి.

ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) జరిగిన RBI తొలి ద్రవ్య విధాన సమావేశంలో (MPC), దేశంలో వడ్డీ రేట్లను పెంచకూడదని నిర్ణయించారు, పాత రేట్లను యథాతథంగా కొనసాగించారు. ఈ నిర్ణయానికి అనుగుణంగానే ఎక్కువ బ్యాంకులు పాత వడ్డీ రేట్లనే కొనసాగిస్తున్నాయి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *