ఇవాళ ‘గాడ్‌ ఆఫ్‌ క్రికెట్‌’ పుట్టినరోజు, ఆ దేవుడి ఆస్తుల విలువెంతో తెలుసా?

[ad_1]

Sachin Tendulkar Net Worth: మన దేశంలో క్రికెట్‌ ఒక మతం. ఈ మతాన్ని అనుసరించే అభిమానుల ఆరాధ్య దైవం పేరు సచిన్‌ రమేష్‌ టెండూల్కర్‌ (Sachin Ramesh Tendulkar). ఇవాళ (ఏప్రిల్ 24, 2023), ‘గాడ్ ఆఫ్ క్రికెట్’ పుట్టిన రోజు. క్రికెట్‌ మైదానంలో 100 సెంచరీలు సాధించిన సచిన్, తన వయస్సు విషయంలో ఇవాళ హాఫ్ సెంచరీ (50 సంవత్సరాలు) సాధించాడు. 

11 సంవత్సరాల వయసులో క్రికెట్ ప్రయాణాన్ని ప్రారంభించిన సచిన్‌, ఎన్నో క్రీడా జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు, క్రికెట్ గాడ్ అయ్యాడు. గుజరాతీ కుటుంబానికి చెందిన వైద్యురాలు అంజలిని వివాహం చేసుకున్న సచిన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2012 మార్చిలో బంగ్లాదేశ్‌పై 114 రన్స్‌ చేయడం ద్వారా 100వ శతకం సాధించిన సచిన్‌.. సెంచరీల సెంచరీ చేసిన తొలి, ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. ఇలాంటి అద్భుతమైన రికార్డ్‌లు సచిన్ టెండూల్కర్ పేరు మీద చాలానే ఉన్నాయి. టెండూల్కర్‌ లాంటి అసాధారణ ప్రతిభావంతులే ఆ రికార్డ్‌లను బద్దలు కొట్టగలరు. 2013 నవంబర్ 16న సచిన్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 

ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితా ప్రకారం, అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుల జాబితాలో సచిన్ టెండూల్కర్ పేరు 51వ స్థానంలో ఉంది.

సచిన్ టెండూల్కర్ పెట్టుబడులు
సచిన్ టెండూల్కర్ క్రికెట్ ద్వారానే కాకుండా ఇంకొన్ని ఇతర మార్గాల నుంచి కూడా డబ్బు సంపాదిస్తున్నాడు. ప్రీమియం బ్యాడ్మింటన్ లీగ్ ISLలో.. కేరళ బ్లాస్టర్స్, బెంగళూరు బ్లాస్టర్స్‌ ఫ్రాంచైజీలకు సహ యజమాని టెండూల్కర్‌. ఇది కాకుండా, ఇంటర్నేషనల్‌ ప్రీమియర్ లీగ్‌లో సచిన్‌కు ముంబై ఫ్రాంచైజీ ఉంది. ఇంకా.. హోటళ్ల మొదలు అనేక ఇతర రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి.

సచిన్ టెండూల్కర్ రెండు రెస్టారెంట్లకు యజమాని. వాటిలో ఒకటి ముంబైలో, మరొకటి బెంగళూరులో ఉన్నాయి. ఈ రెస్టారెంట్ల పేర్లు సచిన్, టెండూల్కర్. హోటళ్లు, స్పోర్ట్స్ ఫ్రాంచైజీల నుంచి 70 శాతం వృద్ధిని సచిన్ అంచనా వేశారు. టెండూల్కర్‌కు చెందిన స్పోర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ అయిన స్మాష్ ఎంటర్‌టైన్‌మెంట్, ఇటీవల 5 మిలియన్‌ డాలర్ల పెట్టుబడిని సేకరించింది. ఈ కంపెనీ విలువ సుమారు 100 మిలియన్‌ డాలర్లు ఉంటుందని అంచనా.

అంకుర సంస్థల్లోనూ సచిన్‌ పెట్టుబడులు
స్మార్ట్‌రాన్ ఇండియా, జెట్సింథెసిస్, స్పిన్నీ, ఎస్ డ్రైవ్ & సాచ్ వంటి అనేక స్టార్టప్‌ల్లో సచిన్‌ పెట్టుబడులు పెట్టాడు. 2016లో, అరవింద్ ఫ్యాషన్ లిమిటెడ్‌తో కలిసి ట్రూ బ్లూ అనే మెన్స్ వేర్ కంపెనీని ప్రారంభించాడు. ఆ తర్వాత, తన భార్య అంజలి టెండూల్కర్‌తో కలిసి SRT స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ పేరుతో స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ కంపెనీని స్టార్ట్‌ చేశాడు.

సచిన్ టెండూల్కర్ ఆస్తుల విలువ
ఒక జాబితా ప్రకారం, 2022లో సచిన్ టెండూల్కర్ మొత్తం సంపద 165 మిలియన్‌ డాలర్లు లేదా 1350 కోట్లు రూపాయలు. ప్రస్తుతం, విరాట్ కోహ్లీ అత్యధికంగా సంపాదిస్తున్న క్రీడాకారుడు అయినప్పటికీ, నికర విలువ పరంగా టెండూల్కర్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. పెట్టుబడులు, ప్రకటనల నుంచి ఏడాదికి దాదాపు 50 కోట్ల రూపాయలను టెండూల్కర్‌ సంపాదిస్తున్నట్లు అంచనా. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా వెస్ట్‌లో విలాసవంతమైన బంగ్లాలో నివాసం ఉంటున్నాడు.

టెండూల్కర్‌కు క్రికెట్‌తో పాటు స్పోర్ట్స్‌ కార్లు అంటే పిచ్చి. అయితే.. ఈ క్రికెటర్‌ మొదటిసారి కొన్న కారు మారుతి 800. ప్రస్తుతం అత్యంత ఖరీదైన బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు సచిన్‌ గ్యారేజీలో కలిగి ఉన్నాయి. కేవలం సచిన్‌ కోసమే ప్రత్యేక ఫీచర్లతో వీటిని తయారు చేశారు. టెండూల్కర్ వద్ద ఉన్న కార్ల ఖరీదు 15 కోట్ల రూపాయల కంటే ఎక్కువేనన్నది ఒక లెక్క.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *