Lunar Eclipse 2023: రేపు అరుదైన పెనంబ్రల్ చంద్రగ్రహణం..దీని ప్రత్యేకత ఇదే

[ad_1]

ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాలు ఏర్పడనున్నాయి. వీటిలో రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు. ఇప్పటికే ఏప్రిల్ 20న మొదటి గ్రహణం సంభవించింది. ఇది సూర్యగ్రహణం కాగా.. ఇది ఏర్పడిన రెండు వారాలకే చంద్రగ్రహణ ఏర్పడుతోంది. శుక్రవారం (మే 5న) రెండో గ్రహణం సంభవిస్తోంది. ఈ చంద్ర గ్రహణం ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో కనువిందు చేయనుంది. చంద్రుడి కంటే భూమి పెద్ద కావడం వల్ల నీడ కూడా ఎంతో ఎక్కువ. ఈ కారణంగా, సూర్యగ్రహణాల కంటే చంద్రగ్రహణాలు ప్రపంచంలోని చాలా ప్రాంతాలలో వీక్షించే ఆస్కారం ఉంటుంది.

చంద్రగ్రహణం మే 5న భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 8.45 గంటలకు ప్రారంభమై మే 6న తెల్లవారుజాము 1.02 గంటల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణం మన దేశంలోని వివిధ ప్రాంతాలలో కనిపించనుంది. అంతేకాదు, ఇది అరుదైన చంద్రగ్రహణం. ఎందుకంటే మరో 19 సంవత్సరాల వరకు ఇలాంటి చంద్రగ్రహణం పునరావృతం కాదు. మే 5న ఏర్పడుతోన్న పెనంబ్రల్ చంద్రగ్రహణం.. మళ్లీ 2042లో మాత్రమే సంభవిస్తుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

సాధారణంగా భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖపై వచ్చినపుడు గ్రహణాలు సంభవిస్తాయి. చంద్రుడికి, సూర్యుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఆ సమయంలో చంద్రుడు కనిపించడు. ఇది పౌర్ణమి నాడు సంభవిస్తుంది. ఫలితంగా పౌర్ణమిరోజు పూర్ణ చంద్రుడు గ్రహణ సమయంలో కనిపించడు. అంతేకాకుండా గ్రహణానికి ముందు ఎరుపు రంగులో చంద్రుడు ప్రకాశిస్తాడు. సూర్యకాంతి పొందిన భూమి వాతావరణం చంద్రుడిపై ప్రతిబింబించడంతో ఎర్రగా మారుతుంది. అయితే, అన్ని పౌర్ణమిలలోనూ చంద్రగ్రహణం ఏర్పడదు.

ఇక, శుక్రవారం ఏర్పడనున్న పెనంబ్రల్ చంద్రగ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా మరింత చీకటిలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఎందుకంటే, ఏర్పడబోయే చంద్రగ్రహణంలో భూమి కోణం 5 డిగ్రీల ఎత్తులో ఉంటుంది. దీని వల్ల భూవాతావరణ ప్రభావం చంద్రుడిపై ఉండదు కాబట్టి గ్రహణం తేలికైన రంగులో కనిపిస్తుంది. పాక్షిక, సంపూర్ణ గ్రహణాల కంటే దీనిని గుర్తించడానికి నిశిత పరిశీలన అవసరం అవుతుంది. అందువల్ల ఈ చంద్రగ్రహణం తరచుగా ఏర్పడే ‘అంబ్రల్’ కాకుండా పెనంబ్రల్ చంద్రగ్రహణం అని పరిశోధకులు పేర్కొన్నారు.

వాస్తవానికి చంద్ర గ్రహణాలు మూడు మూడు రకాలు. సంపూర్ణ, పాక్షిక, పెనుంబ్రల్ చంద్ర గ్రహణాలు ఉన్నాయి. చంద్రుడు పెనుంబ్రల్ గుండా ప్రయాణిస్తున్నప్పుడు బయట ప్రాంతంలో భూమి నీడ సన్నగా ఉంటుంది. కాగా, ఖగోళ నివేదికల ప్రకారం, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాలలోని కొన్ని ప్రాంతాలు గ్రహణం వీక్షించే అవకాశం ఉంది.

గ్రహణం సమయంలో రోకళ్లు నిలబెట్టిన జనం

Read More Latest Science & Technology News And Telugu News

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *