Fruits For Heart Health: ఈ పండ్లు తింటే.. గుండెకు మంచిది..!

[ad_1]

Fruits For Heart Health: గుండె శరీరంలో ఎంత ముఖ్యమైన భాగమో అందరికీ తెలిసిందే.. శరీరం అంతటికీ రక్తాన్ని సరఫరా చేసే ముఖ్య అవయవం గుండె. రక్తం ద్వారా శరీర భాగాలకు ఆక్సిజన్ అందించడంలో దీని పాత్ర చాలా కీలకమైంది. అందుకే గుండె ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు మూడింట ఒక వంతు మరణాలు గుండె జబ్బుల కారణంగానే సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. గుండె ఆరోగ్యంగా ఉండటానికి ముందు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హార్ట్‌ హెల్తీగా ఉండటానికి.. మనం తీసుకునే ఆహారం కీలకపాత్ర పోషిస్తుంది. బేరియాట్రిక్ ఫిజీషియన్‌, ప్రముఖ పోషకాహార నిపుణుడు, డైట్ క్వీన్ యాప్ వ్యవస్థాపకుడు కిరణ్ రుక్దికర్ గుండె ఆరోగ్యంగా, దృఢంగా ఉండటానికి సహాయపడే పండ్ల గురించి మనతో పంచకున్నారు. పండ్లలో గుండె ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయని కిరణ్ రుక్దికర్ అన్నారు. మన డైట్‌లో పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల.. కొలెస్ట్రాల్‌, హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది. ఇవి గుండెకు మేలు చేస్తాయి.

ఆరెంజ్‌..

ఆరెంజ్‌లో కెలెస్ట్రాల్‌తో పోరాడే ఫైబర్.. పెక్టిన్ ఉంటుంది. ఆరెంజ్‌లోని పోషకాలు.. కొలెస్ట్రాల్ ఆక్సీకరణను నిరోధించడానికి సహాయపడతాయి. ఆక్సిడైజ్డ్ కొలెస్ట్రాల్ ధమనుల గోడలకు అంటుకుని, ఫలకంలా ఏర్పడుతుంది. చిన్న రక్తనాళాలలో రక్త ప్రవాహాన్ని నిరోధించేంతగా ఫలకం పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్‌కు దారి తీస్తుంది. ఆరెంజ్‌ తింటే.. ధమనులలో కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

బ్లూ బెర్రీ..

బ్లూబెర్రీస్‌లో ఆంథోసైనిన్ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు ధమని గోడలలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్‌ కరిగించడానికి సహాయపడతాయి. బ్లూబెర్రీస్ తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇది గుండె సమస్యలను నుంచి రక్షణ కల్పిస్తుంది.

అరటిపండ్లు..

అరటిపండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది ధమనుల గట్టిపడటం (వాస్కులర్ కాల్సిఫికేషన్) నుంచి రక్షణ కల్పిస్తుంది. అరటిపండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.

యాపిల్‌..

యాపిల్‌.. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. యాపిల్‌లో క్వెర్సెటిన్ అనే ఫైటోకెమికల్‌ ఉంటాయి, ఇది సహజ శోథ నిరోధక ఏజెంట్‌గా పనిచేస్తుంది. క్వెర్సెటిన్ రక్తం గడ్డకట్టడాన్ని నిరోధించడంలో సహాయపడుతుంది. యాపిల్స్‌లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పండులో ఉండే.. పాలీఫెనాల్స్‌ హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.

బ్లాక్‌ బెర్రీ..

బ్లాక్‌బెర్రీస్‌లో గుండెను రక్షించే ఆంథోసైనిన్‌లు ఉంటాయి. బ్లాక్‌బెర్రీస్‌లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ రెండూ ఆరోగ్యకరమైన హృదయనాళ వ్యవస్థకు తోడ్పడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *