అప్పు ఎగ్గొట్టే స్థితిలో అమెరికా – ఐఎంఎఫ్‌ సీరియస్‌ వార్నింగ్‌!

[ad_1]

US defaults: 

ప్రపంచ పెద్దన్నగా గర్వపడే అమెరికా ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది! దాదాపుగా అప్పులు ఎగ్గొట్టే పరిస్థితికి చేరుకుంది. అప్పుల పరిమితి, తుది గడువుపై డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఏకాభిప్రాయానికి రాకపోవడంతో అనిశ్చితి నెలకొంది. ఒకవేళ అప్పులు ఎగ్గొడితే ఆ దేశంతో సహా ప్రపంచ వ్యాప్తంగా ఊహించని పరిణామాలు, కష్టాలు ఎదురవుతాయని ఇంటర్నేషనల్‌ మానిటరీ ఫండ్‌ (IMF) హెచ్చరించింది.

‘అమెరికా అప్పులు ఎగ్గొడితే ఆ దేశంతో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అత్యంత తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మా అసెస్‌మెంట్‌లో తేలింది’ అని ఐఎంఎఫ్‌ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్ జూలీ కొజాక్‌ అన్నారు. ఈ వ్యవహారంతో ముడిపడిన అన్ని పార్టీలు అత్యవసరంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు.

యూఎస్‌ రుణ పరిమితిపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య సయోధ్య కుదరడం లేదు. పరస్పరం అభిప్రాయబేధంతో ఉన్నారు. ఇప్పటికే ఉన్న బిల్లులను చెల్లించేందుకు నిధుల కొరత ఏర్పడక ముందే రుణ పరిమితి పెంచుకొనేందుకు రిపబ్లికన్లు కొన్ని షరతులు విధిస్తున్నారు. బడ్జెట్లో కోతలు విధించేందుకు అధ్యక్షుడు జొ బైడెన్‌ పాలకవర్గం అంగీకరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇందుకు డెమొక్రాట్లు అంగీకరించడం లేదు. స్వచ్ఛందంగా అప్పుల పరిమితిని పెంచాలని పిలుపునిస్తున్నారు. తమ రాజకీయ అజెండాను పుష్‌ చేసేందుకు రిపబ్లికన్లు విపరీత వ్యూహాలను అమలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంతలోనే అప్పులు చెల్లించాల్సి తుది గడువు సమీపిస్తోంది.

ప్రస్తుతం అమెరికాలో తీవ్ర అనిశ్చితి నెలకొందని ఐఎంఎఫ్‌ అంటోంది. రుణాల ఖర్చులు కొండంతలా పెరిగిపోతాయని, ప్రపంచంలో మందగమనం ఏర్పడుతుందని, ఊహించని విపరిణామాలు ఎదురవుతాయని హెచ్చరిస్తోంది. ‘కొన్నేళ్లుగా ప్రపంచం చాలా షాకులు తిన్నది. అందుకే అమెరికా డీఫాల్ట్‌ పరిణామాల నుంచి ప్రపంచాన్ని తప్పించాలని కోరుకుంటున్నాం’ అని కొజాక్‌ అన్నారు.

అమెరికా చరిత్రను పరిశీలిస్తే రుణ పరిమితి ఎత్తేయడం చాలాసార్లు జరిగింది. కాంగ్రెస్‌ నిర్ణయించుకున్న పనులకు చెల్లించేందుకు అప్పులను సమీకరిస్తుంది. గతేడాది జరిగిన మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో హౌజ్‌ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. తమ మద్దతుతో అమెరికా అప్పుల సమస్యను రాబోయే స్పీకర్‌ కెవిన్‌  మెక్‌కార్తీ సమర్థంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారని ప్రకటించారు. కానీ బైడెన్‌ పాలక వర్గం రుణ పరిమితిపై చర్చలు జరిపేందుకు నిరాకరిస్తోంది. దాంతో అనిశ్చితి పెరిగింది.

కొన్ని రోజుల క్రితం మెక్‌కార్తీని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కలిశారు. అయినప్పటికీ రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదర్లేదు. అప్పులు ఎగ్గొట్టడం తమ ముందున్న పరిష్కారం కాదని బైడెన్‌ ప్రకటించారు. తమ మధ్య కొత్త డెవలప్‌మెంట్‌ ఏమీ లేదని మెక్‌ కార్తీ అన్నారు. అప్పులు చెల్లించేందుకు జూన్‌ 1 చివరి తేదీ అని యూఎస్‌ ట్రెజరీ ఈ మధ్యే హెచ్చరించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *