activa ev: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఏ మోడల్, ఎప్పుడొస్తోంది ?

[ad_1]

News

oi-Bogadi Adinarayana

|

activa ev: ఇండియాలో ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. 2019తో పోలిస్తే టూ వీలర్ అమ్మకాలు 300 శాతానికి పైగా పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ద్విచక్రవాహనాల్లో హోండా యాక్టివాకి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టూ వీలర్‌ గా రెండేళ్ల క్రితం జనవరిలో రికార్డు సృష్టించింది. 2.5 కోట్ల స్కూటీలు డెలివరీ అయ్యాయి. అంతటి ప్రఖ్యాత వాహనం EV మోడల్ ను వచ్చే ఏడాది భారత్‌ లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు హోండా అధికారికంగా వెల్లడించింది.

ఇదీ భవిష్యత్ ప్రణాళిక:
యాక్టివా హెచ్-స్మార్ట్ మోడల్ లాంచ్ లో భాగంగా తమ భవిష్యత్ ఈవీ ప్రణాళికలను హోండా MD & CEO అత్సుషి ఒగాటా వెల్లడించారు. హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా (HMSI) వచ్చే ఏడాది ప్రారంభంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగంలోకి ప్రవేశిస్తుందన్నారు. మార్చి 2024 నాటికి ఎలక్ట్రిఫైడ్ వెర్షన్ యాక్టివాను పరిచయం చేయనున్నట్లు చెప్పారు. జపాన్ కు చెందిన నిపుణుల బృందంతో కలిసి ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

activa ev: హోండా నుంచి ఎలక్ట్రిక్ బైక్.. ఏ మోడల్, ఎప్పుడొస్త

భారీ అంచనాల నడుమ..
ప్రస్తుత యాక్టివా 6G ఆధారంగా ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో మార్పిడి చేస్తామని CEO చెప్పారు. 50 kmph వేగంతో దూసుకపోయే విధంగా EV మోడల్‌ ను హర్యానాలోని ప్లాంట్ లో తయారు చేయనున్నట్లు వెల్లడించారు. దాని బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ శ్రేణిని మాత్రం వెల్లడించలేదు. హోండా తాజాగా విడుదల చేసిన హెచ్-స్మార్ట్ మోడల్‌ లో కొత్త స్మార్ట్‌ కీ సిస్టమ్ ద్వారా స్మార్ట్ ఫైండ్, స్మార్ట్ అన్‌ లాక్, స్మార్ట్ స్టార్ట్, స్మార్ట్ సేఫ్ వంటి ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఎల్లాయ్ వీల్స్, సైడ్ స్టాండ్ వార్నింగ్‌ లు అదనపు హంగులు. వీటన్నిటినీ చూస్తున్న వినియోగదారులు.. EV మోడల్‌ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు.

English summary

Honda going to release activa ev in 2024

Honda entering EV segment

Story first published: Monday, January 30, 2023, 16:53 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *