Adani Cement: మూతపడ్డ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీలు..! అయోమయంలో 20 వేల కుటుంబాలు..

[ad_1]

అదానీ సిమెంట్స్..

అదానీ సిమెంట్స్..

ఒకటి తర్వాత మరొకటి ఎదురుదెబ్బలు అదానీ వ్యాపారాలకు కొత్త ఛాలెంజ్ లను ఇస్తున్నాయి. గౌతమ్ అదానీ చేసిన వాటిలో దేశంలోనే అతిపెద్ద డీల్ ఏసీసీ-అంబుజా సిమెంట్స్ కొనుగోలు. ఈ క్రమంలో నెల రోజుల కిందట అదానీకి చెందిన హిమాచల్ ప్రదేశ్‌లోని రెండు సిమెంట్ ప్లాంట్స్ మూసివేతకు దారితీసింది. దీనికి ప్రధాన కారణం కంపెనీకి ట్రాన్స్‌పోర్ట్ యూనియన్‌లకు మధ్య వచ్చిన వివాదం. దీని పరిష్కారానికి అదానీ గ్రూప్ అనేక డిమాండ్లను సమర్పించినట్లు తెలుస్తోంది.

 వివాదం ఏమిటి..?

వివాదం ఏమిటి..?

సరకు రవాణా ఛార్జీల విషయంలో కంపెనీకి ట్రక్కు యూనియన్లకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో బర్మానాలోని ఏసీసీ సిమెంట్ ప్లాంట్, దార్లఘాట్‌లోని అంబుజా సిమెంట్ ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ రెండు ప్లాంట్లు డిసెంబరులో మూసివేయబడ్డాయి. దీనిపై ACC & అంబుజా సిమెంట్స్ CEO అజయ్ కపూర్ హిమాచల్ ప్రదేశ్ అధికారులకు రాసిన లేఖ రాశారు. ఏడాదికి 50,000 కిలోమీటర్లు నడిపేందుకు యూనియన్లు ఒప్పుకోవాలని, వాహనాల సంఖ్యను 550కు తగ్గించి కిలోమీటరుకు ఫిక్స్ డ్ ఖర్చులను తగ్గించాలని కంపెనీ నిర్ణయించినట్లు తెలిపారు.

డిక్టేరర్స్..

డిక్టేరర్స్..

ప్రస్తుతం ట్రక్కు యూనియన్ల పెత్తనంతో ఏకచత్రాధిపత్యం నడుస్తోందని.. దీనిపై నియంత్రణ అవసరమని అదానీ గ్రూప్ కోరుతోంది. యూనియన్లు సరకు రవాణా రేట్లను కృత్రిమంగా నియంత్రిస్తూ అధిక స్థాయిలో ఉండేలా చేస్తున్నాయని ఆరోపించింది. టన్ను సిమెంట్ కిలోమీటరు రవాణాకు యూనియన్లు రూ.11 వసూలు చేస్తుండగా.. దీనిని అదానీ గ్రూప్ రూ.6కు తగ్గించాలని చూస్తోంది. దీంతో యూనియన్లు, కంపెనీ యాజమాన్యానకి మధ్య వైరం మెుదలైంది. ప్రస్తుతం దీనికి పూర్తి స్థాయి పరిష్కారం కుదరకపోవటంతో తాత్కాలికంగా ప్లాంట్లలో తయారీని నిలిపివేయాలని CEO అజయ్ కపూర్ నిర్ణయించారు.

అయోమయంలో కుటుంబాలు..

అయోమయంలో కుటుంబాలు..

ట్రక్కులు సంఖ్యను తగ్గించి వాటి ప్రయాణ దూరాన్ని పెంచాలని కంపెనీ నిర్ణయించింది. గ్రూప్ నిర్ణయం జాతీయ సగటు అయిన లక్ష కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా సిమెంట్ ప్లాంట్ల మూసివేత కారణంగా దాదాపు 20,000 కుటుంబాలు ప్రభావితమైనట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించిన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు.. రెండు పార్టీల మధ్య మధ్యవర్తిత్వం వహించాలని మంత్రి హర్షవర్ధన్ చౌహాన్‌కు బాధ్యతలు అప్పగించారు. అయితే సమస్యకు త్వరగా ఫుల్ స్టాప్ పడాలని అందరూ కోరుకుంటున్నారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *