Adani Enterprises: రివ్వున పెరిగిన అదానీ స్టాక్.. నాలుగు రోజుల్లో 100 శాతం.. టాప్

[ad_1]

 రోజూ పైపైకి..

రోజూ పైపైకి..

అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ స్టాక్ దారుణమైన పతనం తర్వాత తిరిగి పురోగమించటం ప్రారంభించింది. ఈ క్రమంలో గడచిన నాలుగు రోజులుగా స్టాక్ ముందుకు సాగుతూనే ఉంది. అలా స్టాక్ తన 52 వారాల కనిష్ఠ స్థాయి నుంచి కేవలం నాలుగు రోజుల్లో 100 శాతం పెరిగింది. దీంతో ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.2.42 లక్షల కోట్లకు చేరుకుంది.

 ఆగని దూకుడు..

ఆగని దూకుడు..

ఈరోజు అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఉదయం రూ.1,869.85 వద్ద షేర్ తన ప్రయాణాన్ని ప్రారంభించగా ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో గరిష్ఠంగా రూ.2,133.90 రేటును తాకింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టాక్ 17 శాతానికి పైగా లాభంతో రూ.2,112 వద్ద స్టాక్ ట్రేడవుతోంది. ఈ క్రమంలో స్టాక్ ఏకంగా రూ.309 మేర లాభపడింది.

వాల్యుయేషన్ నిపుణుడి అంచనా..

వాల్యుయేషన్ నిపుణుడి అంచనా..

ఈ వారం ప్రారంభంలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ గురు అశ్వత్ దామోదరన్ అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీ ఒక్కో షేరు సరసమైన విలువను రూ.945గా నిర్ణయించారు. హిండెన్ బర్గ్ ఆరోపణలు చేసినప్పటికీ అదానీ స్టాక్ ఇప్పటికీ చౌకగా లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మెుత్తం అదానీ గ్రూప్ కంపెనీల్లో 9 లాభాల్లో ట్రేడవుతున్నాయి. వీటిని గమనిస్తుంటే పరిస్థితులు కుదుటపడుతున్నట్లు తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ గవర్నర్..

రిజర్వు బ్యాంక్ గవర్నర్..

ప్రస్తుతం దేశంలో నడుస్తున్న అదానీ అంశంపై లేవనెత్తిన ప్రశ్నకు ఆర్బీఐ గవర్నర్ బదులిచ్చారు. ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం చాలా బలంగా ఉందని.. కేవలం ఒక కేసు లేదా ఒక సంఘటన వల్ల ఈ రంగం ప్రభావితం కాదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. పెద్ద రుణాలను ఇచ్చే వ్యవహారంలో దేశంలోని బ్యాంకులు నిబంధనలకు లోబడి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. దీనికి ముందు RBI అదానీకి దేశంలోని వివిధ బ్యాంకులు ఇచ్చిన అప్పుల గురించి పూర్తి సమాచారాన్ని సేకరించింది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *