Adani Loans: బ్యాంకులకు ముందుగానే అప్పులు చెల్లించనున్న అదానీ..! పూర్తి వివరాలు ఇలా..

[ad_1]

సిమెంట్ కంపెనీల కొనుగోలు..

సిమెంట్ కంపెనీల కొనుగోలు..

గత ఏడాది మెగా డీల్ ద్వారా హోల్సిమ్ లిమిటెడ్ సిమెంట్ ఆస్తుల కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆర్థిక సహాయం కోసం అదానీ బ్యాంకుల నుంచి దాదాపుగా 4.5 బిలియన్ డాలర్లను అప్పుగా తీసుకున్నారు. దీనికోసం బార్క్లేస్ పీఎల్‌సీ, స్టాండర్డ్ చార్టర్డ్ పీఎల్‌సీ, డ్యుయిష్ బ్యాంక్ ఎజీ నుంచి రుణాన్ని తీసుకున్నారు.

ముందుగా చెల్లింపు..

ముందుగా చెల్లింపు..

సిమెంట్ కంపెనీ కొనుగోలు కోసం పైన చెప్పిన బ్యాంకుల నుంచి అదానీ తీసుకున్న లోన్‌లో కొంత భాగం మార్చి 9న చెల్లించాల్సి ఉంది. రుణంలో కొంత భాగాన్ని రీఫైనాన్స్ చేయడానికి బ్యాంకులతో అదానీ గ్రూప్ చర్చలు జరిపిందని, అయితే దానిని ముందస్తుగా చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు అదానీ ప్రతినిధి తెలిపారు.

బిలియన్ డాలర్లు ఆవిరి..

బిలియన్ డాలర్లు ఆవిరి..

ఒకానొక సమయంలో ప్రపంచ కుబేరుల జాబితాలో రెండవ స్థానంలో నిలిచిన గౌతమ్ అదానీ కేవలం ఒక్క నివేదిక ఫలితంగా కుప్పకూలారు. ఈ క్రమంలో ఆయనకు చెందిన 10 కంపెనీల్లో జరిగిన విపరీతమైన అమ్మకాల కారణంగా ఏకంగా 117 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయారు. ఈ క్రమంలో అదానీ లోన్స్ కోసం షేర్ల తాకట్టు టాప్ అప్ చేయాల్సి వచ్చింది. దీనంతటికీ కారణం అదానీ తన ఆఫ్ షోర్ కంపెనీల ద్వారా అక్రమాలకు పాల్పడినట్లు హిండెన్ బర్గ్ బాంబు లాంటి నివేదికను విడుదల చేయటమే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *