Airline: దేశంలో మరో ఎయిర్ లైన్ కంపెనీ షురూ.. చరిత్రలో తొలిసారిగా రికార్డు..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

JettWings:
చాలా
కాలం
తర్వాత
దేశీయ
విమానయాన
రంగంలో
ఒకపక్క
ఒడిదొడుకులు
కొనసాగుతుండగా..
మరోపక్క
కొత్త
విమానయాన
సంస్థల
అరంగేట్రం
జరుగుతోంది.


క్రమంలో
ఈశాన్య
భారతదేశం
నుంచి
మెుట్టమెుదటి
విమానయాన
సంస్థగా
జెట్‌వింగ్స్
ఎయిర్‌వేస్
అవతరించి
చరిత్రలో
కొత్త
అధ్యాయాన్ని
ప్రారంభిస్తోంది.

కంపెనీ
అక్టోబర్
2023
నుంచి
తన
వాణిజ్య
కార్యకలాపాలను
ప్రారంభిస్తుందని
తెలుస్తోంది.

క్రమంలో
జెట్‌వింగ్స్
ఎయిర్‌వేస్‌
పౌర
విమానయాన
మంత్రిత్వ
శాఖ
నుంచి
నో
అబ్జెక్షన్
సర్టిఫికేట్(NOC)
పొందింది.

Airline: దేశంలో మరో ఎయిర్ లైన్ కంపెనీ షురూ.. చరిత్రలో తొలిసా

మోదీ
ప్రభుత్వం
ప్రవేశపెట్టిన
ప్రాంతీయ
కనెక్టివిటీ
స్కీమ్
UDAN
కింద
భారతదేశంలో
షెడ్యూల్
చేసిన
ప్రయాణికుల
విమాన
రవాణా
సేవలను
నిర్వహించడానికి
కంపెనీకి
వీలు
కలగనుంది.
కంపెనీ
ప్రస్తుతం
DGCA
నుంచి
ఎయిర్
ఆపరేటర్
సర్టిఫికేట్
కోసం
వేచి
ఉంది.
అసోం
కేంద్రంగా
పనిచేస్తున్న
క్యారియర్
తన
విమానాలను
ఖరారు
చేస్తోంది.

ప్రక్రియ
ఏడాది
చివరి
నాటికి
పూర్తవుతుందని..
అక్టోబర్
నాటికి
కేవలం
రెండు
విమానాలతో
సేవలను
ప్రారంభించాలని
యోచిస్తోంది.

మెుదట్లో
ఎయిర్
వేర్
కేవలం
ఈశాన్య
ప్రాంతాల్లో
మాత్రమే
పనిచేస్తుందని
తెలుస్తోంది.

తర్వాతి
కాలంలో
దేశంలోని
ఇతర
ప్రాంతాలకు
సేవలను
విస్తరించనుంది.
అన్ని
అనుమతులు
వచ్చిన
తర్వాత
ఈశాన్య
భారతదేశంలో
దాని
మూలాలు
లోతుగా
వేళ్లూనుకుని,
ప్రత్యేకమైన
ఇంకా
ముఖ్యమైన
గమ్యస్థానాలను
కలుపుతూ
విశ్వసనీయమైన,
స్థిరమైన
విమానయాన
సంస్థగా
మారడానికి
కట్టుబడి
ఉన్నట్లు
వ్యవస్థాపకుడు,
CEO
సంజయ్
ఆదిత్య
సింగ్
తెలిపారు.

ఉడాన్
స్కీమ్
కింద
కనెక్టివిటీని
మెరుగుపరచడం,
కొత్త
ఆర్థిక
అవకాశాలను
సృష్టించడం
ద్వారా
ఈశాన్య
ప్రాంతంపై
గణనీయమైన
ప్రభావాన్ని
చూపడానికి
అవకాశం
ఉందని
సింగ్
వెల్లడించారు.

English summary

JettWings stood as first aviation company from north eastern states under UDAN scheme

JettWings stood as first aviation company from north eastern states under UDAN scheme

Story first published: Thursday, June 15, 2023, 20:10 [IST]



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *