airtel: కళ్లు చెదిరే లాభాలు పోస్ట్ చేసిన భారతీ ఎయిర్ టెల్‌

[ad_1]

భారీ లాభాలు:

భారీ లాభాలు:

డిసెంబరుతో ముగిసిన మూడవ త్రైమాసికం ఫలితాలను భారతీ ఎయిర్ టెల్ మంగళవారం ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే నికరలాభం 91.5 శాతం మేరకు పెరిగి రూ. 1,588 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. వ్యాపారంలో పోటీతత్వం వృద్ధి వల్ల ఇది సాధ్యమైందని పేర్కొంది.

ఒక్క మూడో త్రైమాసికంలో మొత్తం ఆదాయం దాదాపు 20 శాతం పెరిగి రూ.35,804 కోట్లకు పెరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఏకీకృత నికర ఆదాయం రూ.1,994 కోట్లు కాగా.. క్రితం ఏడాదితో పోలిస్తే 147 శాతం పెరిగిందని చెప్పింది.

కస్టమర్ బేస్ లక్ష్యంగా..

కస్టమర్ బేస్ లక్ష్యంగా..

కంపెనీ వ్యాపారాల్లో స్థిరమైన, పోటీతత్వ వృద్ధిని మరో త్రైమాసికంలోనూ సాధించినట్లు భారతీ ఎయిర్‌టెల్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ తెలిపారు. “3.7 శాతం ఆదాయ వృద్ధితో EBITDA మార్జిన్ ను 52 శాతానికి విస్తరించాం. నాణ్యమైన వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా పనిచేసి, 6.4 మిలియన్ల 4G కస్టమర్‌ బేస్‌ ను సాధించాం. తద్వారా టెలికాం పరిశ్రమలో అత్యంత ఎక్కువ ARPU(ఒక వినియోగదారుడిపై సగటు ఆదాయం) రూ.193తో అగ్రస్థానం కైవసం చేసుకున్నాం” అని ప్రకటించారు.

మూలధన వ్యయం-ఫ్రీ క్యాష్ ఫ్లో:

మూలధన వ్యయం-ఫ్రీ క్యాష్ ఫ్లో:

ఇండియాలో 2022 డిసెంబర్ త్రైమాసికంలో భారతీ ఎయిర్‌టెల్ ఆదాయం 19 శాతం పెరిగి రూ.24,961.5 కోట్లకు చేరింది. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే కంపెనీ మూలధన వ్యయం సైతం.. రూ.6,101 కోట్ల నుంచి 52 శాతం వృద్ధితో రూ.9,313 కోట్లకు పెరిగింది. భారత్‌ లో 5G నెట్‌వర్క్ విస్తరణ కారణంగా ఈ పెరుగుదల నమోదైంది. మూలధన వ్యయం పెరగడంతో ఫ్రీ క్యాష్ ఫ్లోలో 12 శాతం క్షీణత ఏర్పడినట్లు విట్టల్ తెలిపారు.

సబ్‌ స్క్రైబర్ బేస్‌ లో మంచి వృద్ధి:

సబ్‌ స్క్రైబర్ బేస్‌ లో మంచి వృద్ధి:

డిసెంబర్ 2021లోని రూ.163తో పోలిస్తే.. 2022 చివరి నాటికి భారత్‌ లో మొబైల్ ARPU రూ.193కి పెరిగింది. 2022 సెప్టెంబర్ త్రైమాసికానికి ARPU రూ.190గా ఉంది. దేశంలోని 36.92 కోట్ల మంది కస్టమర్‌లు సహా గ్లోబల్ కస్టమర్ బేస్‌ లో 5.8 శాతం వృద్ధితో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 51 కోట్లకు చేరుకుంది. ఇండియాలో ఎయిర్‌ టెల్ మొబైల్ సబ్‌ స్క్రైబర్ బేస్ ఏడాదికి 2.9 శాతం వృద్ధితో 1.8 కోట్ల పోస్ట్‌పెయిడ్ కస్టమర్లతో సహా 33.22 కోట్లకు పెరిగంది. మార్చి 2024 నాటికి అన్ని పట్టణాలు, కీలకమైన గ్రామీణ ప్రాంతాలను కవర్ చేయడానికి 5G సదుపాయాలను కల్పిస్తున్నట్లు MD వెల్లడించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *