Alibaba: వ్యాపార సామ్రాజ్యాన్ని ముక్కలు చేయనున్న అలీబాబా.. అసలు ఎందుకీ నిర్ణయం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Alibaba: చైనాకు చెందిన ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ చాలా పెద్దది. జాక్ మా సృష్టించిన ఈ వ్యాపార సామ్రాజ్యం విలువ దాదాపు 220 బిలియన్ డాలర్లు. చైనా ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ సంస్థకు చెడ్డ కాలం మెుదలైంది. కంపెనీకి సంబంధించిన యాంట్ కార్పొరేషన్ ఐపీవోను సైతం అర్థాంతరంగా నిలిచిపోయింది. అలా జాక్ మా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

ప్రపంచ మార్కెట్లలో అలీబాబాకు చెందిన ఈ కామర్స్ సంస్థ ఇతిపెద్ద మార్కెట్ కలిగి ఉంది. దీనికి 200 దేశాల నుంచి కోటి మంది యాక్టివ్ కస్టమర్లు కూడా ఉన్నారు. అలీబాబా మెుత్తం వ్యాపారాల్లో ఈ రంగం విలువ దాదాపు 102 బిలియన్ డాలర్లుగా ఉంది. మార్చి 31, 2022తో ముగిసిన సంవత్సరంలో Alibaba.com ద్వారా 190కి పైగా దేశాల నుంచి 4 కోట్లకు పైగా కొనుగోలుదారులు వ్యాపార అవకాశాలను లేదా లావాదేవీలను పూర్తి చేశారని కంపెనీ తెలిపింది.

Alibaba: వ్యాపార సామ్రాజ్యాన్ని ముక్కలు చేయనున్న అలీబాబా..

ఇదే క్రమంలో కంపెనీ కామర్స్, క్లౌడ్, కైనియావో లాజిస్టిక్స్, కన్జూమర్ సర్వీసెస్, డిజిటల్ మీడియా, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో వ్యాపారాలను కలిగి ఉంది. అయితే ఇప్పటి వరకు ఇవన్నీ ఒకటే గొడుగు కింద కలిసి ఉన్నాయి. ఈ క్రమంలో అలీబాబా సంస్థ తన మెుత్తం వ్యాపారాలను 6 విభాగాలుగా విభజించి ముక్కలుగా చేయాలని నిర్ణయించింది. వీటిని విడి ఎంటిటీలుగా మార్చటం ద్వారా వ్యాల్యూ అన్ లాకింగ్ జరుగుతుందని కంపెనీ భావిస్తోంది.

చైనా ఆన్‌లైన్ కామర్స్ లీడర్ మంగళవారం తన 220 బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని ఆరు యూనిట్లుగా విభజించే ప్రణాళికలను ప్రకటించి మార్కెట‌్లను ఆశ్చర్యపరిచింది. కొత్తగా ఎర్పడనున్న కంపెనీలు ఐపీవోలుగా మార్కెట్లోకి వచ్చి తమ అవసరాలకు నిధులను సమీకరించుకోనున్నాయని గ్రూప్ వెల్లడించింది. ఈ ప్రకటనతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. దీంతో అలీబాబా షేర్లు హాంగ్ కాంగ్ లో ఏకంగా 16 శాతానికి పైగా పెరిగాయి. ఈ నిర్ణయంతో కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 30 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. వ్యాపార మార్గాలను, నిర్ణయ అధికారాలను వికేంద్రీకరించటం ద్వారా చైనా ప్రభుత్వ అణచివేత నుంచి కంపెనీకి ఊరట లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

English summary

China e-commerce jaint alibaba decided to split empire float them as seperate entities for value unlocking

China e-commerce jaint alibaba descided to split empire float them as seperate entities for value unlocking

Story first published: Wednesday, March 29, 2023, 11:52 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *