Amazon Layoffs: మరో బాంబు పేల్చిన అమెజాన్.. టార్గెట్ 20,000..!

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ మరో బాంబు పేల్చింది. టాప్‌ మేనేజర్లు సహా 20 వేల మందికి ఉద్వాసన పలికేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన అమెజాన్.. కార్పొరేట్, టెక్నాలజీ పని చేస్తున్న సుమారు 10,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. దీనికి రెట్టింపు సంఖ్యలో పింక్ స్లిప్ ఇవ్వవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా నివేదికల ప్రకారం రిటైల్, క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్‌ దెబ్బతో రానున్న రోజుల్లో అమెజాన్‌ ఉద్యోగుల‌పై వేటు వేసేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది.

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్కర్లు, టెక్నాలజీ సిబ్బంది, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా రాబోయే నెలల్లో కంపెనీ అంతటా 20,000 మంది ఉద్యోగులను తొలగించాలని అమెజాన్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆర్థిక మాంద్యం, ఆదాయల క్షీణత నేపథ్యంలో వ్య‌య నియంత్ర‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. తొల‌గించే ఉద్యోగుల‌కు 24 గంట‌ల ముందు నోటీసు జారీచేయ‌డంతో ప‌రిహార ప్యాకేజ్‌ను సెటిల్ చేయనున్నారు.

Amazon Layoffs: మరో బాంబు పేల్చిన అమెజాన్.. టార్గెట్ 20,000.

మెటా, ట్విట్టర్ వంటి టెక్ దిగ్గజాలు లేఆఫ్ స్ప్రీకి వెళ్లిన తర్వాత అమెజాన్ కూడా ఉద్యోగులను తొలగిస్తుందని న్యూయార్క్ టైమ్స్ నవంబర్ తెలిపింది. Amazon 20,000 మంది ఉద్యోగులను తగ్గించినట్లయితే.. కార్పొరేట్ సిబ్బందిలో 6 శాతం తొలగించినట్లు అవుతుంది. తొలగించాల్సిన ఉద్యోగుల సంఖ్యపై ఎటువంటి వివరాలను వెల్లడించకుండా తొలగింపులు జరుగుతున్నాయని నవంబర్ 17న CEO అయిన ఆండీ జాస్సీ ధృవీకరించారు. “మా వార్షిక ప్రణాళిక ప్రక్రియ కొత్త సంవత్సరం వరకు విస్తరించింది, అంటే నాయకులు సర్దుబాట్లు చేస్తూనే ఉన్నందున మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉంటాయి” అని జాస్సీ పబ్లిక్ సందేశంలో రాశారు.

English summary

E-commerce giant Amazon is set to lay off more employees

E- Commerce giant Amazon has dropped another bombshell. There are reports that 20 thousand people including top managers are getting ready to be fired.

Story first published: Monday, December 5, 2022, 13:28 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *