[ad_1]
నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) సమాచారం ప్రకారం ఈ గ్రహ శకలాలను 488453 (1994 ఎక్స్ డీ), 2020 డీబీ5గా పిలుస్తున్నారు. ఇందులో 488453 (1994 ఎక్స్ డీ) జూన్ 12 అంటే సోమవారమే భూమికి సమీపానికి రానుంది. గంటకు 77,292 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోన్న ఈ గ్రహశకలం.. భూమికి ఇది 31,62,498 కిలోమీటర్ల సమీపానికి రానుందని పేర్కొంది. 1,500 అడుగుల చుట్టుకొలతతో ఓ వంతెన పరిమాణంలో ఉండే ఆస్టరాయిడ్ చివరిగా 2012 నవంబర్ 27న భూమికి సమీపంగా వచ్చి వెళ్లింది. తిరిగి 2030లో చేరువగా రానుంది.
ఇక, ఈ నెల 15న 2020 డీబీ5 గ్రహ శకలం భూమికి సమీపంగా రానుంది. ఆ సమయంలో భూమికి, ఆస్టరాయిడ్‌కు మధ్య దూరం 43,08,418 కిలోమీటర్లుగా ఉంటుంది. గంటకు 34,272 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తోంది. చివరిగా 1995లో భూమికి దగ్గరగా వచ్చి వెళ్లిన గ్రహశకలం.. మళ్లీ 2048లోనే ఇలా రానుంది. అయితే, ఈ రెండింటి వ్యాసార్థం 150 మీటర్లకు మించి ఉన్నందున ప్రమాదకరమైనవిగానే శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. వీటి గమనంపై నాసా ఓ కన్నేసి ఉంచింది.
జెట్ ప్రొపల్షన్ లాబొరేటరీస్ సెంటర్ ఫర్ NEO స్టడీస్ భూమికి సమీపంలో ఉన్న వస్తువుల జాబితాను పరిశీలిస్తుంది. ఇవి ఏదైనా సంభావ్య ప్రమాదాలను ముందుగానే గుర్తించడానికి భూమికి దగ్గరగా ఉంటాయి. భూమికి 4.6 మిలియన్ మైళ్లలోపు వచ్చే, దాదాపు 150 మీటర్ల కంటే ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉన్న అన్ని అంతరిక్ష శిలలను ప్రమాదకర వస్తువులుగా నాసా జేపీఎల్ వర్గీకరించింది. ఈ వర్గీకరణ మన గ్రహానికి ప్రమాదం కలిగించే వస్తువులను పర్యవేక్షించడానికి, అంచనా వేయడానికి తోడ్పడుతుంది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply