[ad_1]
సరిగ్గా నీళ్లు తాగకపోతే..
చాలా మంది ఆఫీస్ పనిలో పడి.. నీళ్లు తాగడం మర్చిపోతూ ఉంటారు. కీళ్లను లూబ్రికేట్‌గా ఉంచడానికి హైడ్రేట్‌గా ఉంచడం చాలా అవసరం, ఇది వెన్ను నొప్పులను తగ్గించడంలో సహాయపడతుంది. నీళ్లు సరిగ్గా తాగకపోతే.. వెన్నునొప్పి, కీళ్ల సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. మీరు డెస్క్‌పై పెద్ద వాటర్ బాటిల్ పెట్టుకోండి. రోజుంతా నీటిని సిప్ చేస్తూ ఉండండి.
ప్రొటీన్ సరిగ్గా తీసుకోకపోతే..
మీ డైట్‌లో తగినంత ప్రొటీన్ తీసుకోకపోతే.. వెన్నునొప్పి సమస్య వచ్చే అవకాశం ఉంది. శరీరంలో కండరాల పెరుగుదల, మరమ్మత్తులను ప్రేరేపించడానికి ప్రొటీన్ అవసరం.
షుగర్ ఎక్కువగా తీసుకుంటే..
కొంతమందికి ఆఫీస్‌లో కాఫీలు, డ్రింక్స్ వంటివి ఎక్కువగా తాగుతూ ఉంటారు. మీ ఆహారంలో చక్కెర స్థాయిలు ఎక్కువ అయితే.. వెన్నునొప్పికి కారణం అవుతుంది. చక్కెర శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను ప్రేరేపిస్తుంది. డెస్క్ జాబ్ చేసే వారు.. వెన్నునొప్పి ముప్పును తగ్గించుకోవడానికి.. చక్కెరకు దూరంగా ఉండటం మంచిది.
ఎక్కువ సేపు కూర్చోవడం..
ఆఫీస్‌లో గంటలతరబడి ఒకేచోట కూర్చుని పనిచేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మెడ, భుజాలు, చేతులు, నడుంవద్ద కండరాలపై ప్రభావం చూపుతుంది. కంటికి తిన్నగా కంప్యూటర్ ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. కీబోర్డు మోచేతులకు సమాన ఎత్తులో ఉండటం తప్పనిసరి. ముందుకు వంగి కూర్చోవడం, కంటికి దగ్గరగా కంప్యూటర్ స్క్రీన్ ఉండటం మంచిది కాదు. మీరు ప్రతి 45 నిమిషాల తర్వత కనీసం.. 10 నిమిషాల పాటు నడవడం మంచిది.
ఒత్తిడి..
మీ మనస్సు, శరీరం ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటాయి. అందుకే మీ మానసిక ఒత్తిడి కారణంగా.. వెన్నునొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడికి గురైనప్పుడు.. మీ వెన్నుపూస చుట్టూ ఉన్న చిన్న కండరాలు స్విచ్ ఆఫ్ చేస్తుంది. మీ ఆఫీస్ ఒత్తిడిని తగ్గించుకోవడానికి.. పాటలు వినడం, ధ్యానం, యోగా చేయండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply