Bank News: లోన్ రేట్లు పెంచేసిన బ్యాంక్.. ఈరోజు నుంచే బాదుడు.. మీకూ లోన్ ఉందా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Bank News: జనాలపై ఉన్న భారం చాలదంటూ బ్యాంకులు రుణ రేట్లను పెంచేస్తున్నాయి. దీంతో చాలా మంది అప్పులు తీసుకోవాలంటేనే భయపడిపోతున్నారు. ఇదే సమయంలో మరో బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.

వడ్డీ రేట్లను పెంచుతున్న బ్యాంకుల జాబితాలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా చేరిపోయింది. తాజాగా బ్యాంక్ తన ఎంసీఎల్ఆర్ రేట్లలో దీనికి అనుగుణంగా మార్పులు సైతం చేసింది. అన్ని కాలాలకు MCLR రేట్లను సవరించింది. మారిన కొత్త రేట్లు జనవరి 10, 2023 అంటే నేటి నుంచే అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది.

Bank News: లోన్ రేట్లు పెంచేసిన బ్యాంక్.. ఈరోజు నుంచే బాదుడు

ఓవర్‌నైట్, ఒక నెల MCLR కోసం రుణాల వడ్డీ రేటును సెంట్రల్ ఆఫీస్‌లోని టాప్ మేనేజ్‌మెంట్ మాత్రమే మంజూరు చేస్తుందని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఓవర్‌నైట్, ఒక నెల MCLR మంజూరు చేసే విచక్షణ ఏ ఇతర ఫంక్షనరీల వద్ద అందుబాటులో ఉండదని కూడా తెలిపింది.

Bank News: లోన్ రేట్లు పెంచేసిన బ్యాంక్.. ఈరోజు నుంచే బాదుడు

గత నెల 7న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పెంచిన తర్వాత దానికి అనుగుణంగా దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు మార్పులు చేస్తున్నాయి. ఆ సమయంలో గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ రేటును 35 బేసిస్ పాయింట్ల మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో రెపో రేటు మెుత్తం 6.25 శాతానికి చేరుకుంది. రెపో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు నిధులను ఇచ్చే రేటు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ రెపో రేటులో మార్పులు చేస్తుంటుంది. ఈ ఏడాది మెుదటి అర్థభాగంలో సైతం ఇలాంటి పెంపులు కొనసాగుతాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

English summary

Indian Overseas bank announced loan rates hike from januart 10th MCLR changed

Indian Overseas bank announced loan rates hike from januart 10th MCLR changed

Story first published: Tuesday, January 10, 2023, 16:12 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *