Benefits Of Lentils: పప్పు రోజూ తింటే.. ఎన్ని లాభాలో తెలుసా..?

[ad_1]

పోషకాలు మెండుగా ఉంటాయి..

పోషకాలు మెండుగా ఉంటాయి..

కాయధాన్యాలలో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో విటమిన్‌–బి1, బి2, బి3, బి5, బి6, సి, ఇ, కె వంటి విటమిన్లు ఉంటాయి. వీటిలో క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. విటిలో 25 శాతం ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి. వెజిటేరియన్స్‌కు మాంసానికి కాయధాన్యాలు ప్రత్యామ్నాయం అని చెప్పొచ్చు. (image source – pixabay)

గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

గట్‌ ఆరోగ్యానికి మేలు చేస్తుంది..

పప్పులో ప్రీబయోటిక్స్‌, పైబర్‌ జీర్ణక్రియకు మేలు చేస్తాయి. ఇవి కడపులో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి ఇంధనంలా పనిచేస్తాయి. ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారం తింటే.. కొలోరెక్టల్‌ క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది.

(image source – pixabay)

Intestine Cleansing Foods: ఇవి తింటే కడుపులో చెత్త బయటకొచ్చేస్తుంది..!

ప్రొటీన్ స్టోర్‌ హౌస్‌..

ప్రొటీన్ స్టోర్‌ హౌస్‌..

కాయధాన్యాలలో ప్రొటీన్‌ అధికంగా ఉంటుంది. చేపలు, మాంసానికి ప్రత్యామ్నాయంగా ప్రొటీన్‌ను తీసుకోవచ్చని నిపుణలుు చెబుతున్నారు. ప్రొటీన్ కణజాలాలను నిర్మించడానికి, మరరమ్మత్తు చేయడానికి, ఎంజైమ్‌లు, హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది. కండర వ్యవస్థను దృఢంగా ఉంచడంలో ప్రొటీన్ల పాత్ర పోషిస్తుంది. ఎముకలు, కండరాలు, చర్మం, రక్తం పెరుగుదలకు ప్రొటీన్‌ అవసరం. (image source – pixabay)

శక్తి అందిస్తుంది..

శక్తి అందిస్తుంది..

పప్పుని రోజూ తినడం వల్ల మేలు చేసే ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బో హైడ్రేట్‌లూ శరీరానికి అందుతాయి. తక్షణ శక్తినీ అందిస్తాయి. పప్పులో ఐరన్‌ మెండుగా ఉంటుంది. మన రోజువారీ కావలసిన ఐరన్‌లో 15% సగం కప్పు వండిన పప్పులో దొరుకుతుంది. ఐరన్‌ రక్తహీనతను దూరం చేస్తుంది. (image source – pixabay)

Food Allergy: సాధారణంగా వచ్చే.. ఫుడ్‌ అలెర్జీలు ఇవే..!

అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది..

అనారోగ్యాల ముప్పును తగ్గిస్తుంది..

కొన్ని రకాల గుండె వ్యాధులనూ, క్యాన్సర్లతో పాటు టైప్‌-2 డయాబెటిస్‌, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కాయధాన్యాలలో ఫినాల్స్‌ ఉంటాయి. కాయధాన్యాలలో కార్డియోప్రొటెక్టివ్, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి.

గుండెకు మంచిది..

గుండెకు మంచిది..

పప్పు తరచుగా తింటే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. అదనంగా, కాయధాన్యాలు రక్తపోటును తగ్గిస్తాయి. యాంజియోటెన్సిన్ I-కన్వర్టింగ్ ఎంజైమ్ తరచుగా రక్తనాళాల సంకోచానికి కారణం అవుతుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. పప్పులోని ప్రొటీన్లు దీన్ని నిరోధిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *