[ad_1]
బ్లూ లైట్ అంటే ఏమిటి?
లైట్ స్పెక్ట్రం రంగులలో బ్లూ లైట్ ఒకటి, ఈ కాంతికి గురికావడం వల్ల కళ్ల రెటీనా దెబ్బతింటుందని, కంటి చూపు సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా రాత్రి సమయంలో మానవ శరీరంపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. పగటి పూట బ్లూ రైస్ ప్రయోజనకరంగా ఉంటాయి, ఇది శ్రద్ధి, మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి, మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. అయితే ఇవి రాత్రి సమయంలో విఘాతం కలిగిస్తాయి. రాత్రి సమయంలోనూ కంప్యూటర్ స్క్రీన్‌లు, మొబైల్ ఫోన్ స్క్రీన్‌లు ఎక్కువగా చూడటం వల్ల బ్లూ రైస్‌కు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాం.
(image source – pixabay)
బ్లూ లైట్ గ్లాసెస్ అంటే ఏమిటి?
బ్లూ లైట్ గ్లాసెస్‌లో యూవీ కిరణాలు, బ్లూ రేస్ కంటిని తాకకుండా వాటిని నిరోధించడానికి, గ్రహించడానికి వాటిలో ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఎక్కువ సేపు, కంప్యూటర్ స్క్రీన్‌లు, మొబైల్ ఫోన్ ఎక్కువ సేపు చూస్తుంటే.. ఈ అద్దాలు మీ కళ్లను రక్షిస్తాయి.
(image source – pixabay)
అధ్యయనంలో ఏమి తేలింది..?
కోక్రాన్ లైబ్రరీ ప్రచురించిన ఈ అధ్యయనంలో 17 అధ్యయనాలను పరిశీలించారు, 156 మంది పాల్గొన్నారు. ప్రామాణిక లెన్స్‌లతో పోల్చితే బ్లూ లైట్ ఫిల్టరింగ్ గ్లాసెస్ ఉపయోగించడం వల్ల కంటి ఒత్తిడి తగ్గదని పరిశోధకులు కనుగొన్నారు. ఫోన్, లేదా కంప్యూటర్ విడుదల చేసే నీలిరంగు కాంతి పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది, అందుకే దాన్ని నిరోధించడం వల్ల కంటి ఒత్తిడిని పెద్దగా తగ్గించలేదు. మీరు రోజులో నాలుగ గంటలకు మించి డిజిటల్ స్క్రీన్ వాడుతుంటే.. దృష్టి సమస్యలు, కంటి చికాకుకు గురయ్యే అవకాశం ఉంది మెల్‌బోర్న్ విశ్వవిద్యాలయంలో ఆప్టోమెట్రీ సైన్సెస్ అసోసియేట్ ప్రొఫెసర్ లారా డౌనీ అన్నారు.
(image source – pixabay)
నిద్రను మెరుగుపరుస్తాయా..?
బ్లూ లైట్ కారణంగా, ఒక వ్యక్తి నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. ఇది మెదడులో మెలటోనిన్ స్రవించే సామర్థ్యాన్ని నిరోధిస్తుంది. మెలటోనిన్ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. బ్లూ ఫిల్టరింగ్ గ్లాసెస్ నిద్రను మెరుగుపరుస్తుందని అందరూ అనుకుంటారు. కానీ డౌనీ, ఆమె బృందం దీనిపై మిశ్రమ ఫలితాలను కనుగొన్నారు. కొన్ని అధ్యయనాలు మంచి నిద్ర స్కోర్‌లను చూపించగా, వేరేవి చూపించలేదు.
(image source – pixabay)
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply