Blue Tea: ఈ నీలం టీ తాగితే.. గుండె, మెదడు ఆరోగ్యంగా ఉంటాయ్..!

[ad_1]

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

శంఖుపుష్పం టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌ నుంచి రక్షిస్తాయి. ఫ్రీ రాడికల్స్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీసే హానికరమైన పదార్థాలు. ఖాళీ కడుపుతో వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఒక కప్పు టీ తాగితే.. జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్‌ తొలగుతాయి. ఇది జీర్ణక్రియ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌, కడుపుఉబ్బరం వంటి సమస్యలు నయం అవుతాయి. (image source – pixabay)

బరువు తగ్గుతారు..

బరువు తగ్గుతారు..

బరువు తగ్గేవారికి ఈ టీ ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్‌ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్‌, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ ఉండవు. ఇది బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. ఇది జీర్ణక్రియ నుంచి ఆహార వ్యర్థాలు, టాక్సిన్స్‌ను తొలగిస్తాయి, అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. శంఖుపుష్పం టీ మీ బరువును కంట్రోల్‌లో ఉంచే ఒక అద్భుతమైన హెర్బల్ డ్రింక్. (image source – pixabay)

డయాబెటిక్ లక్షణాలను తగ్గిస్తుంది..

డయాబెటిక్ లక్షణాలను తగ్గిస్తుంది..

రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే.. జీర్ణక్రియ మెరుగుపడుతుందని, రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి, గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. ఉపవాసం ఉన్నప్పుడు, భోజనం చేసిన తర్వాత శరీర కణాల ద్వారా చక్కెరలను అధికంగా శోషించడాన్ని నిరోధిస్తుంది. షుగర్‌ పేషెంట్స్‌ ఈ టీ తాగితే మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. (image source – pixabay)

గుండెకు మేలు చేస్తుంది..

గుండెకు మేలు చేస్తుంది..

శంఖు పుష్పాల టోలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. దీనిలోని యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రోజూ ఈ టీ తాగితే.. హానికరమైన ట్రైగ్లిజరైడ్, చెడు కొలెస్ట్రాల్‌ సాంద్రతలు తగ్గుతాయి. అదే సమయంలో మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిలను పెంచుతుంది. ఇది క్రమంగా, అథెరోస్క్లెరోసిస్, హార్ట్ ఎటాక్‌, ధమనులలో రక్తం గడ్డకట్టడం, హైపర్‌టెన్షన్‌ వంటి తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. (image source – pixabay)​

Brain Boosting Foods : మీ బుర్రకు పదును పెట్టే.. ఆహారాలు ఇవే..!

కళ్లకు మంచిది..

కళ్లకు మంచిది..

శంఖు పుష్పాలలో ఉండే ప్రోయాంతోసైనిడిన్ కాంప్లెక్స్‌లు కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఈ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, అనాల్జేసిక్ లక్షణాలు కంటి ఇన్ఫెక్షన్లు, ఎరుపు, వాపు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఆప్టిక్ కణాలు, కళ్ల వైపు, అవసరమైన పోషకాలతో నిండిన రక్త ప్రవాహాన్ని ప్రేరేపిస్తుంది. ఈ టీ రోజూ తగితే.. దృష్టి, కంటి సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. (image source – pixabay)

మెదడుకు మంచిది..

మెదడుకు మంచిది..

శంఖు పుష్పాలటీ మెదడు ఆరోగ్యానికి, ఆందోళన, నిరాశకు చికిత్స చేయడానికి ఆయుర్వేదంలో వాడుతుంటారు. దీనిలోని ఎసిటైల్కోలిన్ సమ్మేళనం అల్జీమర్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. ఈ టీ తాగితే మెదడు రిఫ్రెష్ ‌ అవుతుంది, సానుకూల భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంది. తద్వారా పనిలో ఉత్పాదకతను పెంతుంది. (image source – pixabay)​

Health Care: నూనె, నెయ్యి కలిపి వంట చేయవచ్చా..?

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *