[ad_1]
పోషకాహారం తీసుకోండి..
ఎముకలు దృఢంగా ఉండాలంటే.. సమతుల్య, పోషకమైన ఆహారం అవసరం. ఎముకల ఆరోగ్యం మెరుగుపరచడానికి కాల్షియం, విటమిన్ డి చాలా అవసరం. మీ ఎముకలను బలంగా ఉంచుకోవడానికి పాల ఉత్పత్తులు, సీఫుడ్, ఆకుకూరలు తీసుకోండి. వీటిలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. విటమిన్ డి పొందడానికి ఉదయం, సాయంత్రం పూట కొంత సేపు ఎండలో సమయం గడపండి. కాల్షియం, విటమిన్ డి లోపం కారణంగా.. ఎముకల సాంద్రత తగ్గిపోతుంది, దీని కారణంగా ఎముకల పగుళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది.
(image source – pixabay)
బరువును కంట్రోల్ ఉంచుకోండి..
ఎముకలు బలంగా ఉండటానికి, ఆరోగ్యకరమైన శరీర బరువు అవసరం. బరువు తక్కువగా ఉన్నా, ఎక్కువగా ఉన్నా.. మీ ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. బరువు తక్కువగా ఉంటే.. ఎముక సాంద్రతను తగ్గిస్తుంది, అధిక బరువు ఎముక నాణ్యతను బలహీనపరుస్తుంది. తరచూ బరువు తగ్గుతూ, పెరిగినా.. ఎముకల ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
Diabetes Care: షుగర్ పేషెంట్స్ ఈ 5 నియమాలు పాటిస్తే.. మీ గుండె సేఫ్..!
వ్యాయామం చేయండి..
ఎముకలు బలంగా ఉండాలంటే.. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బరువు మోసే వ్యాయామాలు ఎముకలను దృఢంగా ఉంచుతాయని అంటున్నారు. వ్యాయామం ఎముక సాంద్రతను పెంచుతుంది, ఎముకలకు మద్దతు ఇచ్చే బలమైన కండరాలను నిర్మిస్తుంది. వాకింగ్, రన్నింగ్, వెయిట్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి, ఎముకల నష్టాన్ని తగ్గిస్తాయి.
Health Care: కిడ్నీల్లోనే కాదు.. ఈ భాగాల్లోనూ రాళ్లు ఏర్పడతాయ్..!
స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి..
స్మోకింగ్, ఆల్కహాల్ ఎముక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ అలవాట్లు.. ఎముకలను నిర్మించడంలో సహాయపడే పోషకాలను వినియోగించే శరీర సామర్థ్యాన్ని కూడా తగ్గిస్తాయి. స్మోకింగ్ శరీరాన్ని బలహీనపరుస్తుంది. ఎముకలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్మోకింగ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి.
రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేయించుకోండి..
తరచుగా ఎముకల సాంద్రత స్కాన్ చేయించుకుంటు.. ఎముకల ఆరోగ్యాన్ని పరీక్షించవచ్చు. మొదటే ఎముక సమస్యలను గుర్తిస్తే.. దీర్ఘకాలిక సమస్యల ముప్పు తగ్గుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply