[ad_1]
డబుల్ ధమాకా:
షేర్ హోల్డర్ల నుంచి రూ.2 ముఖ విలువ కలిగిన కంపెనీ ఈక్విటీ షేర్లను బైబ్యాక్ చేయున్నట్లు సింఫనీ(Symphony) ప్రకటించింది. ప్రస్తుత మార్కెట్ ధర రూ.1,047 ఉండగా.. రూ.2,000 చొప్పున తిరిగి కొనుగోలు చేయనున్నట్లు తెలిపింది. రికార్డ్ తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు వెల్లడించింది. టెండర్ ఆఫర్ విధానంలో స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఈ కొనుగోళ్లు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఒక్కో షేరుకు రూ.2 వేల చొప్పున రూ.200 కోట్లకు మించకుండా ఈ డీల్ పూర్తిచేయనున్నట్లు ఓ ప్రకటనలో చెప్పింది.
సెబీ నిబంధనల మేరకే..
ఈక్విటీ షేర్ల బైబ్యాక్ ద్వారా 10 లక్షల షేర్లను తిరిగి కొనుగోలు చేయాలని సింఫనీ చూస్తోంది. కాగా మార్చి 31, 2022 నాటికి కంపెనీ మొత్తం ఈక్విటీ క్యాపిటల్ లో ఈ షేర్ల వాటా 1.43 శాతం. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి స్టాండ్ ఎలోన్, కన్సాలిడేటెడ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్‌ల ప్రకారం.. SEBI నిర్దేశించిన బై బ్యాక్ నియమాలకు లోబడి ఈ డీల్ పూర్తి చేస్తున్నట్లు తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ లో కంపెనీ పేర్కొంది. నియంత్రణ సంస్థ నిర్దేశించిన 25 శాతం లోపు అంటే పూర్తిగా చెల్లించిన ఈక్విటీ మూలధనం, ఫ్రీ రిజర్వ్స్ మొత్తం 24.76, 24.69 శాతంగానే ఉన్నాయని వెల్లడించింది.
భారీగా పెరిగిన షేర్ ధర:
బైబ్యాక్ ప్రకటన తర్వాత సింఫనీ షేరు ధర 8.47 శాతం పెరిగి రూ.1,047 వద్ద ట్రేడ్ అయింది. అనంతరం 12 శాతాన్ని సైతం టచ్ చేసింది. డిసెంబర్ 2022 త్రైమాసిక ఫలితాలను సైతం బుధవారమే విడుదల చేయడమూ ఈ భారీ పెరుగుదలకు ఓ కారణమైంది. గత త్రైమాసికంలో అత్యధిక స్టాండలోన్ అమ్మకాలను నమోదు చేసినట్లు అందులో ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం ఎయిర్ కూలర్‌లు, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల తయారీపై ప్రస్తుతం దృష్టి పెట్టింది.
[ad_2]
Source link
Leave a Reply