CAకి డబ్బులు ఇవ్వొద్దు, మీ ITR మీరే ఫైల్ చేయొచ్చు

[ad_1]

How To File Income Tax Return: 2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌/2022-23 ఫైనాన్షియల్‌ ఇయర్‌ కోసం ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయడానికి గడువు సమీపిస్తోంది. టాక్స్‌ పేయర్లకు ఈ నెలాఖరు వరకే సమయం ఉంది. ఈ నెలలో ఇప్పటికే ఒక వారం గడిచిపోయింది. ఇక మిగిలింది కేవలం 3 వారాలు మాత్రమే.

గతేడాది గడువు పెంచలేదు        
అంతేకాదు, ఫైలింగ్‌ లాస్ట్‌ డేట్‌ను ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఎక్స్‌టెండ్‌ చేస్తుందన్న భావన కూడా ప్రజల్లో ఉంది. గత ఏడాది ఆదాయ పన్ను పత్రాల దాఖలుకు గడువును పొడిగించలేదని గుర్తు పెట్టుకోండి. ఈ ఏడాది కూడా అదనపు సమయం ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

వెయ్యి రూపాయలు ఆదా చేయొచ్చు  
ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్ నింపడం క్లిష్టమైన పని కాదు. ఈ ప్రాసెస్‌ ఈజీగా ఉండేలా ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తోంది. ఫామ్‌ 16, ఫారం 26S, AIS, TIS వంటి డాక్యుమెంట్లు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్‌ను సులభమైన పనిగా మార్చాయి. కొన్ని ఈజీ స్టెప్స్‌తో ఇంట్లో కూర్చొని మీ ITRని మీరే ఫైల్ చేయవచ్చు. ఇందుకోసం ఏ చార్టెర్డ్ అకౌంటెంట్‌ (CA) ఆఫీస్‌ చుట్టూ తిరగాల్సిన పని లేదు, వెయ్యి రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు. 

ITRని ఇలా ఫైల్ చేయండి (How to file ITR, A step by Step guide)   

ముందుగా, ఆదాయ పన్ను విభాగం ఈ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/ కి వెళ్లండి.
మీకు ఇప్పటికే అకౌంట్‌ ఉంటే, యూజర్‌ ఐడీ (పాన్‌), పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వండి
అకౌంట్‌ లేకపోతే, కొత్త ఖాతా ఓపెన్‌ చేయడానికి ‘రిజిస్టర్’ పై క్లిక్ చేయండి
హోమ్ పేజీలో ఈ-ఫైల్ ఆప్షన్‌ ఎంచుకోండి
ఇప్పుడు ‘ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్‌’ను, ఆ తర్వాత ‘ఫైల్‌ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్’ ఆప్షన్‌ ఎంచుకోండి.
ముందుగా అసెస్‌మెంట్ ఇయర్‌ని ఎంచుకునే ఆప్షన్ కనిపిస్తుంది
ఆ తర్వాత ‘ఆన్‌లైన్‌’ మోడ్‌ మీద క్లిక్‌ చేయండి. 
ఐటీఆర్ ఫైల్ చేయడానికి ఇండివిడ్యువల్‌ ఆప్షన్‌ తీసుకోండి
ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం తగిన ఫామ్‌ ఎంచుకోవడం
మీకు జీతం ఉంటే, ITR-1 ఫామ్‌ ఎంచుకోండి
జీతం తీసుకునే టాక్స్‌ పేయర్లకు ‘ప్రి-ఫిల్‌డ్‌ ఫామ్‌’ అందుబాటులో ఉంటుంది
మీ శాలరీ స్లిప్, ఫామ్ 16, AIS మొదలైన వాటి నుంచి డేటా తీసుకోండి
రిఫండ్‌ క్లెయిమ్‌ చేసే ముందు, బ్యాంక్ అకౌంట్‌ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేయండి
అన్నింటినీ క్రాస్ చెక్ చేసిన తర్వాత ITR సమర్పించండి

ఈ-వెరిఫై చేయడం తప్పనిసరి        
ITR సబ్మిట్‌ చేసిన తర్వాత ఐటీఆర్‌ను ఈ-వెరిఫై చేయడం కూడా తప్పనిసరి. మీ బ్యాంక్ వివరాల సాయంతో మీరు ఆ పనిని ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయొచ్చు. ఆదాయ పన్ను విభాగం మీ ITRని 3-4 వారాల్లో ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెసింగ్‌ స్టేటస్‌ను మీ రిసిప్ట్‌ నంబర్‌ ద్వారా ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

మరో ఆసక్తికర కథనం:  వా, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా- ధోనీ వెంటపడుతున్న కంపెనీలు!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *