[ad_1]
ఆగస్టు 23 వ తేదీన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపనుందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. అయితే బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై దిగుతుందని తెలిపింది. ఇక ఇప్పటికే చివరి బూస్టింగ్ ప్రక్రియను విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ పూర్తి చేసుకుందని పేర్కొంది. ఈ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ 25 కిలోమీటర్లు X 134 కిలోమీటర్ల కక్ష్యలో తిరుగుతోందని వివరించింది. ఈ నేపథ్యంలోనే విక్రమ్ ల్యాండర్ జాబిల్లి దక్షిణ ధ్రువం మీద సాఫ్ట్ ల్యాండింగ్ చేసేలా ఇస్రో దృష్టి సారించింది.
విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్‌ను అంతర్గతంగా పూర్తిగా తనిఖీ చేయాల్సి ఉందని తెలిపింది. ల్యాండింగ్ సమయంలో దక్షిణ ధ్రువంపై సూర్యుని వెలుగు కోసం చూస్తున్నట్లు ఇస్రో పేర్కొంది. అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23 వ తేదీన సాయంత్రం 5.45 నిమిషాలకు ప్రారంభమవుతుందని.. 6.04 గంటలకు పూర్తి అవుతుందని ఇస్రో ట్విటర్ వేదికగా వెల్లడించింది.
మరోవైపు.. చంద్రయాన్ 3 కి పోటీగా రష్యా చేపట్టిన లూనా 25 స్పేస్క్రాప్ఠ్ విఫలమైంది. చంద్రుడి వద్దకు వెళ్లిన లూనా 25.. చివరి అంకం వద్ద ఫెయిల్ అయి.. జాబిల్లిపై కాలుపెట్టకుండానే కుప్పకూలిపోయింది. దీనికి సంబంధించి రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం చంద్రయాన్ 3 ల్యాండింగ్‌పై పడింది.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply