Cleaning Hacks: మిక్సీ జార్‌పై మరకలు వదలట్లేదా..? ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి కొత్తదానిలా మెరుస్తుంది..!

[ad_1]

Cleaning Hacks: ఈ రోజుల్లో మిక్సర్‌ గ్రైండర్‌ లేని వంటగది లేదు. మిక్సర్‌ గ్రైండర్‌తో వంటపనులన్నీ చకచకా అయిపోతాయ్‌. మసాలా పొడులు, పిండులు, చట్నీ, జ్యూస్‌లు ఇలా ఏది తయారు చేయాలన్నా.. మిక్సర్‌ గ్రైండర్‌ అవసరం. మిక్సీ జార్స్‌ వాడిన తర్వాత ఎంత శుభ్రం చేసినా.. కొన్ని బండ మరకలు జార్‌లో పేరుకుపోతాయి. దీని వల్ల.. మిక్సీ జార్‌ ఎప్పుడూ మురికిగా, పసుపు రంగులోకి మారుతుంది. ఎంత శుభ్రం చేసినా.. ఈ మరకలు, మురికి వదలదు. కొన్ని సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే.. మిక్సీ జార్‌ మరకలు సులభంగా వదిలించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

బేకింగ్‌ పౌడర్‌తో మెరిపించండి..

బేకింగ్ పౌడర్ న్యాచురల్‌ క్లీనర్‌గా పనిచేస్తుంది. ఇది మరకలను తొలగించడానికి సహాయపడుతుంది. ఇది మరకలు తొలగించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఒక గిన్నెలో బేకింగ్‌ సోడా వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను జార్‌ లోపల, బయట రాయండి. కొన్ని నిమిషాలు అలానే ఉంచి.. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే.. మరకలు పోవడమే కాకుండా, దాని నుంచి వచ్చే వాసన కూడా పోతుంది.

శానిటైజర్‌ సాయంతో క్లీన్‌ చేయండి..

మిక్సీ జార్‌ క్లీన్‌ చేయడానికి శానిటైజర్‌ ఎఫెక్టివ్‌ హ్యాక్‌గా పనిచేస్తుంది. దీని కోసం, జార్‌లో కొంత శానిటైజర్‌ వేసి, మూత పెట్టండి. మూతపెట్టి.. మిక్సీ ఆన్‌ చేసి గ్రైండ్‌ చేయండి. ఆ తర్వాత మిక్సీ జార్‌ను సాధారణ నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే మరకలు మాయం అవ్వడంతో పాటు, జార్‌ నుంచి వచ్చే షూటైన వాసన పోతుంది.

నిమ్మతొక్కలతో..

నిమ్మతొక్కల సాయంతో జార్‌పై మరకలు.. తొలగించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఇది జార్‌ నుంచి వచ్చే వాసనను తొలగించడంతోపాటు, పసుపు మరకలను మాయం చేస్తాయి. ముందుగా.. మిక్సీ జార్‌ క్లీన్‌ చేసి.. దాన్ని నిమ్మ తొక్కతో లోపల, బయట రుద్దండి. కొన్ని నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత నీటితో శుభ్రం చేయండి. ఇలా చేస్తే మిక్సీ జార్‌ కొత్తదానిలా మెరుస్తుంది.

వైట్ వెనిగర్‌తో మిలమిల మెరిపించండి..

మిక్సీ జార్‌పై మరకలు పోగొట్టాలంటే.. నీటిలో రెండు చెంచాలా వెనిగర్‌ వేసి మిక్స్‌ చేయండి. ఈ వాటర్‌ను మిక్సీ జార్‌లో వేసి స్విచ్‌ ఆన్‌ చేయండి. ఇలా చేస్తే పసుపు మరకలు మాయం అవుతాయి. దుర్వాసన కూడా పోతుంది.

ఆల్కహాల్‌తో..

ఆల్కహాల్ మీ మిక్సీ జార్‌ను శుభ్రం చేయడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దీనికో ఒక గిన్నెలో ఆల్కహాల్‌ తీసుకుని, దీనికి నీరు యాడ్‌ చేయండి. దీన్ని మిక్సర్‌ జార్‌లో పోసి కొన్ని నిమిషాలు తిప్పండి. ఆ తర్వాత.. నార్మల్‌ వాటర్‌తో శుభ్రం చేయండి. ఇది జార్‌ నుంచి వచ్చే వాసన కూడా పోగొడుతుంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *