coal auction: 7వ రౌండ్ బొగ్గు గనుల వేలానికి కేంద్రం ప్రకటన.. ఈసారి ఎన్ని కేటాయించనున్నారంటే..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

coal auction: బొగ్గును నల్లబంగారంగా పరిగణిస్తారు. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో కరెంటు ఉత్పత్తికి దీన్ని పెద్దమొత్తంలో వినియోగిస్తుంటారు. అయితే దేశంలో ఈ గనులు ప్రభుత్వ అధీనంలో ఉంటాయి. వీటిని వేలం ద్వారా వివిధ సంస్థలకు కేంద్రం కేటాయిస్తూ ఉంటుంది. ఇప్పటికే 6 సార్లు ఈ వ్యవహారం జరగ్గా.. 7వ రౌండ్ పై సంబంధిత మంత్రిత్వ శాఖ అప్‌డేట్ ఇచ్చింది.

106 గనుల వేలం:
బొగ్గు గనుల 7వ రౌండ్ వాణిజ్య వేలాన్ని ప్రభుత్వం బుధవారం ప్రారంభించనున్నట్లు బొగ్గు మంత్రిత్వ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. మొత్తం 106 గనుల బ్లాక్లను ఈసారి కేటాయించనుంది. వీటిలో 61 గనులు పాక్షికంగా, 45 పూర్తిగా అన్వేషించబడినవి. 95 నాన్-కోకింగ్ బొగ్గు గనులు, ఒక కోకింగ్ బొగ్గు గని మరియు 10 లిగ్నైట్ గనులు తాజా వేలంలో కేంద్రం విక్రయించనుంది.

coal auction: 7వ రౌండ్ బొగ్గు గనుల వేలానికి కేంద్రం ప్రకటన..

రెండు దశల్లో పారదర్శకంగా..
మార్చి 29, 2023 నుంచి టెండర్ డాక్యుమెంట్ల విక్రయం ప్రారంభమవుతుంది. గనుల వివరాలు, వేలం నిబంధనలు, టైమ్‌ లైన్‌ మొదలైన వాటిని MSTC వేలం ప్లాట్‌ఫారంలో యాక్సెస్ చేయవచ్చు. రెవెన్యూ వాటా శాతం ఆధారంగా రెండు దశల ప్రక్రియలో పారదర్శకంగా ఈ ప్రక్రియ జరగనుంది. కేంద్ర మంత్రుల సమక్షంలో ఈ ప్రక్రియ జరగనుంది.

ఆరో రౌండ్ ఒప్పందాలపై సంతకాలు:
అదే రోజు ఆరో రౌండ్ కింద వేలం వేసిన 28 గనులకు సంబంధించిన ఒప్పందాలపైనా సంతకాలు జరగనున్నట్లు బొగ్గుశాఖ పేర్కొంది. ఏడాదికి 74 మిలియన్ టన్నుల (MTPA) పీక్ రేటెడ్ కెపాసిటీ (PRC) వీటి సొంతం. దీని ప్రకారం వార్షిక ఆదాయం రూ.14,497 కోట్లుగా అంచనా వేసింది. ఈ గనులు ప్రారంభమైన తర్వాత లక్ష మందికి ఉపాధి లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

రక్షణశాఖ మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని తదుపరి రౌండ్ వేలాన్ని ప్రారంభించనున్నారు. కేంద్ర బొగ్గు గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, కేంద్ర బొగ్గు గనులు మరియు రైల్వే శాఖ సహాయ మంత్రి రావుసాహెబ్ పాటిల్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించనున్నారు.

English summary

Coal ministry announced 7th round coal blocks auction

7th round coal blocks auction

Story first published: Monday, March 27, 2023, 21:57 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *