Concord Biotech, Vaibhav Gems IPO: ఆ ఐపీఓలకు ఒకే చెప్పిన సెబీ..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

కిణ్వ ప్రక్రియ-ఆధారిత క్రియాశీల ఔషధ పదార్థాల (APIలు) తయారీదారు కాంకర్డ్ బయోటెక్ లిమిటెడ్ ఐపీఓకు సెబి ఒకే చెప్పింది. అలాగే
విశాఖపట్నానికి చెందిన జ్యువెలరీ ప్లేయర్ వైభవ్ జెమ్స్ ఎన్’ జ్యువెలర్స్ లిమిటెడ్ ఐపీఓకు కూడా సెబి అనుమతి ఇచ్చింది. రాకేష్ జున్‌జున్‌వాలా రేర్ ఎంటర్‌ప్రైజెస్, క్వాడ్రియా క్యాపిటల్ మద్దతు ఉన్న కాంకర్డ్ IPO పూర్తి ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉండనుంది. 20,925,652 ఈక్విటీ షేర్లు ఐపీఓ ద్వారా విక్రయించనున్నారు. కంపెనీ ఉద్యోగులకు కొన్ని షేర్లు రిజర్వ చేస్తారు.

అహ్మదాబాద్‌
అహ్మదాబాద్‌కు చెందిన ఈ కంపెనీ FY22 కార్యకలాపాల ద్వారా రూ.712.93 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.616.94 కోట్లుగా ఉంది. సంవత్సరానికి లాభం రూ.174.93 కోట్లుగా ఉందని కంపెనీ తెలిపింది. కోటక్ మహీంద్రా క్యాపిటల్ కంపెనీ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, జెఫరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఐపీఓకు బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్‌లువ్యవహరిస్తున్నాయి. లింక్ ఇన్‌టైమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆఫర్‌కు రిజిస్ట్రార్ గా వ్యవహరిస్తుంది.

 Concord Biotech, Vaibhav Gems IPO:

వైభవ్ జెమ్స్ రూ.210 కోట్ల IPO
వైభవ్ జెమ్స్ ఎన్’ జ్యువెలర్స్ లిమిటెడ్ ప్రమోటర్ సంస్థ HUF గ్రాంధి భరత మల్లికా రత్న కుమారి తన 43 లక్షల ఈక్విటీ షేర్ల OFS ద్వారా అమ్మనున్నారు. ఈ ఐపీఓ ద్వారా రూ.210 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కంపెనీ DRHP తాజా ఇష్యూ ద్వారా వచ్చిన మొత్తం ఎనిమిది కొత్త షోరూమ్‌ల స్థాపనకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలతో పాటు ఇన్వెంటరీ కొనుగోలుకు ఆర్థిక సహాయం చేయడానికి ఉపయోగిస్తామని తెలిపింది. ఈ కంపెనీ బంగారం, వజ్రాలు, విలువైన రత్నాలు, ప్లాటినం, వెండి వస్తువులతో కూడిన అనేక రకాల ఆభరణాల ఉత్పత్తులను అందిస్తుంది.

English summary

Sebi approves IPOs of Concord Biotech Ltd, Vaibhav Gems

SEBI approves IPO of Concord Biotech Limited and IPO of Vaibhav Gems. Both these IPOs are coming soon.

Story first published: Wednesday, December 7, 2022, 16:51 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *