Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా ? ఐతే తెలియకుండానే ఇన్ని ఛార్జీలు కడుతున్నారు !!

[ad_1]

 క్యాష్‌ బ్యాక్‌ లు, రివార్డు పాయింట్లు:

క్యాష్‌ బ్యాక్‌ లు, రివార్డు పాయింట్లు:

ఏదైనా కొనుగోలు చేస్తే బ్యాంకును బట్టి దాదాపు నెల తర్వాత తిరిగి చెల్లించే సౌలభ్యం క్రెడిట్ కార్డు ద్వారా లభిస్తుంది. ఇదేకాక రివార్డ్ పాయింట్‌లు, తగ్గింపు ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ వంటి అనేక ప్రయోజనాలు అదనం. వీటి సంగతి సరే మరి మీకు తెలియకుండానే చెల్లిస్తున్న ఛార్జీలేంటి ? క్రెడిట్ కార్డు ఉచితమైనా కొన్ని ఛార్జీలు చెల్లించడం తప్పనిసరా అంటే.. ఆయా బ్యాంకులను బట్టి ఈ రుసుములు వేర్వేరుగా ఉంటాయి. అవేంటో చూద్దాం..

 జాయినింగ్ & రెన్యువల్ ఛార్జీలు:

జాయినింగ్ & రెన్యువల్ ఛార్జీలు:

కార్డ్ జారీ చేసే సమయంలో కట్టే వన్‌ టైం ఛార్జీయే జాయినింగ్ ఫీజు. వార్షిక రుసుము మాత్రం ప్రతి ఏడాదీ వసూలు చేయబడుతుంది. గడువు ముగిసిన తర్వాత కార్డు రెన్యువల్ కోసమూ డబ్బు కట్టాల్సి ఉంటుంది. కొన్ని బ్యాంకులైతే.. ఓ ఏడాదిలో నిర్ణీత మొత్తాన్ని ఖర్చు చేసినట్లయితే వార్షిక, రెన్యువల్ ఫీజు మినహాంపు ఇస్తున్నాయి.

 ఆలస్యానికీ రుసుము:

ఆలస్యానికీ రుసుము:

ప్రతి నెలా గడువు తేదీలోగా వినియోగదారులు క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. పూర్తిగా చెల్లిస్తే ఇబ్బంది ఉండదు. కానీ గడువులోగా చెల్లించకపోయినా, కనీస మొత్తాన్ని మాత్రమే చెల్లించినా అందుకూ జరిమానా విధిస్తారు. కార్డు జారీ చేసిన బ్యాంకును బట్టి ఎంత చెల్లించాలనేది ఆధారపడి ఉంటుంది.

ఉపసంహరణలపై భారీగా..

ఉపసంహరణలపై భారీగా..

క్రెడిట్ కార్డ్‌లు కేవలం దుకాణాల్లో చెల్లింపులు జరపడానికి మాత్రమే ఉద్దేశించినవి. కానీ అత్యవసర పరిస్థితుల్లో డబ్బు కావాలంటే ఏటీఎం ద్వారా నగదు విత్‌ డ్రా చేసుకోవచ్చు. కానీ కార్డు నుంచి తీసుకున్న నగదులో దాదాపు 3 శాతం ఛార్జీలుగా చెల్లించాల్సి ఉంటుంది. ఏదైనా సమయంలో ముందుగా నిర్ణయించిన పరిమితిని మించి ఖర్చు చేస్తే అందుకూ ఛార్జీల బాదుడు తప్పదు.

స్వదేశీ / విదేశీ లావాదేవీలపైనా..

స్వదేశీ / విదేశీ లావాదేవీలపైనా..

ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా విదేశీ లావాదేవీల కోసం క్రెడిట్‌ కార్డును వినియోగిస్తే 4 శాతం వరకు రుసుము వసూలు చేయవచ్చు. వీటి నుంచి తప్పించుకోవాలంటే ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులను ఎంచుకోవాలి. దేశీయంగా చూస్తే క్రెడిట్ కార్డ్ ల ద్వారా జరిపే లావాదేవీలన్నింటిపై ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం జీఎస్టీ విధించబడుతుంది. ఈఎంఐలు, వార్షిక రుసుము, వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులపైనా జీఎస్టీ కట్టాల్సిందే.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *