Crude Oil: బ్యారెల్ చమురు 100 డాలర్లను తాకితే భారత మార్కెట్లు ఎలా రియాక్ట్ అవుతాయో తెలుసా..?

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Crude
Oil:

ఒపెక్
దేశాలు
తమ
చమురు
ఉత్పత్తిని
తగ్గించాలని
అకస్మాత్తుగా
తీసుకున్న
నిర్ణయం
కొత్త
సంక్షోభానికి
దారితీస్తుందని
నిపుణులు
ఆందోళన
వ్యక్తం
చేస్తున్నారు.
ఇప్పటికే
మెుండిగా
కొనసాగుతున్న
ద్రవ్యోల్బణానికి
ఇది
ఆజ్యం
పోస్తుందని
వారంటున్నారు.

ఏప్రిల్
2
నుంచి
రోజుకు
1.16
మిలియన్
బ్యారెళ్ల
చమురు
ఉత్పత్తిని
తగ్గించాలని
OPEC,
రష్యాతో
సహా
దాని
మిత్రదేశాలు
నిర్ణయించటంతో
బ్యారెల్
చమురు
ధర
85
డాలర్లకు
చేరుకుంది.
ఇది
అక్టోబర్
2022లో
ప్రకటించిన
రోజుకు
రెండు
మిలియన్
బ్యారెల్స్
ఉత్పత్తి
కోతకు
అదనం.

Crude Oil: బ్యారెల్ చమురు 100 డాలర్లను తాకితే భారత మార్కెట్ల

ప్రస్తుతం
భారత్
తన
ఇంధన
అవసరాలకోసం
85
శాతం
ముడి
చమురును
దిగుమతి
చేసుకోవటంపైనే
ఆధారపడి
ఉంది.
ప్రపంచవ్యాప్తంగా
మూడవ
అతిపెద్ద
వినియోగదారు,
చమురు
దిగుమతిదారుగా
భారత్
కొనసాగుతోంది.
ఇది
ద్రవ్యోల్బణాన్ని
పెంచటంతో
పాటు..
రూపాయి
విలువను
తగ్గిస్తుంది.
పైగా
కరెంట్
ఖాతా
లోటును
పెంచుంది.

క్రూడ్
ధరలు
బ్యారెల్‌కు
100
డాలర్ల
మార్కును
తాకిన
నెలల్లో
సెన్సెక్స్
రాబడులు
బలహీనంగా
నమోదయ్యాయని
గత
గణాంకాలు
చెబుతున్నాయి.
ధరల
పెరుగుదల
ఈక్విటీ
మార్కెట్లను,
వృద్ధి
దృక్పథాన్ని
దెబ్బతీస్తుందని
అవి
రుజువు
చేస్తున్నాయి.
జనవరి
2000
సంవత్సరం
నుంచి
క్రూడ్
ధరలు
100
డాలర్ల
కంటే
ఎక్కువ
స్థాయిలో
కొనసాగినప్పుడు
60
నెలల్లో
35
నెలలు
సెన్సెక్స్
ప్రతికూల
రాబడులను
అందించింది.

ప్రస్తుత
వాతావరణాన్ని
చూస్తుంటే
ఏడాది
చివరి
నాటికి
మళ్లీ
క్రూడ్
ఆయిల్
ధర
బ్యారెల్
100
డాలర్లకు
చేరుకునే
అవకాశం
ఉందని
నిపుణులు
అంచనా
వేస్తున్నారు.
రోజుకు
1
మిలియన్
బ్యారెల్స్
సరఫరా
తగ్గితే
చమురు
ధర
20-25
డాలర్ల
మేర
ప్రభావితం
అవుతుందని
వారు
చెబుతున్నారు.
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థలు
ప్రస్తుతం
నెమ్మదించిన
తరుణంలో
ఉత్పత్తి
కోతలు
ప్రపంచ
ఆర్థిక
వ్యవస్థకు
మరింత
హానికరమని
హెచ్చరిస్తున్నారు.

English summary

Know how indian stock markets reacted when crude price per barrel reached 100 dollars Know in detail

Know how indian stock markets reacted when crude price per barrel reached 100 dollars, Know in detail

Story first published: Tuesday, April 11, 2023, 11:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *