Crude Oil: రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనా..

[ad_1]

News

oi-Chekkilla Srinivas

|

మేలో
రష్యా
ఎగుమతి
చేసిన
చమురులో
80
శాతం
భారత్,
చైనాలు
కొనుగోలు
చేశాయని
అంతర్జాతీయ
ఇంధన
సంస్థ
(ఐఇఎ)
శుక్రవారం
వెల్లడించింది.
“భారతదేశం
కొనుగోళ్లను
రోజుకు
2
మిలియన్
బ్యారెల్స్‌కు
పెంచింది.
అయితే
చైనా
రోజుకు
500,000
బ్యారెల్స్‌ను
రోజుకు
2.2
మిలియన్
బ్యారెల్స్‌కు
పెంచింది”
అని
IEA
తన
చమురు
మార్కెట్
నివేదికలో
పేర్కొంది.

రష్యా
నుంచి
సముద్రమార్గాన
ముడి
చమురు
ఎగుమతులు
మేలో
రోజుకు
సగటున
3.87
మిలియన్
బ్యారెల్స్‌గా
ఉన్నాయి,
ఫిబ్రవరి
2022లో
రష్యా
ఉక్రెయిన్‌పై
దాడి
చేసిన
తర్వాత
ఇదే
అత్యధికం.
“మే
2023లో,
రష్యా
ముడి
చమురు
ఎగుమతుల్లో
భారత్,
చైనా
దాదాపు
80
శాతం
వాటాను
కలిగి
ఉన్నాయి”
అని
IEA
తెలిపింది.
రష్యా
చమురు
దిగుమతులు
ఏప్రిల్‌తో
పోల్చితే
14
శాతం
ఎక్కువగా
ఉన్నాయని
పేర్కొంది.

Crude Oil: రష్యా నుంచి భారీగా ముడి చమురును దిగుమతి చేసుకుంటు

గతంలో
రష్యా
ఐరోపా
దేశాలకు
ముడి
చమురును
ఎగుమతి
చేసేది.
అయితే
గతేడాది
ఉక్రెయిన్
తో
యుద్ధం
మొదలు
పెట్టడంతో
ఐరోపా
దేశాలు
క్రూడ్
ఆయిల్
దిగుమతిని
నిషేదించాయి.
రష్యా
నుంచి
ఆసియా
దేశాలకు
90
శాతం
కంటే
ముడి
చమురు
దిగుమతి
అవుతుంది.
యుద్ధానికి
ముందు
ఇది
34
శాతంగా
ఉండేది.
పలు
దేశాలు
రష్యాపై
ఆంక్షాలు
విధించడంతో

దేశం
రాయితీతో
ముడి
చమురు
ఎగుమతి
చేసేందుకు
ముందుకు
వచ్చేది.


అవకాశాన్ని
అందిపుచుకున్న
భారత్,
చైనా
కంపెనీలు
భారీగా
ముడి
చమురును
దిగుమతి
చేసుకుంటున్నాయి.
భారత్
కు
అంతకు
ముందు
సౌదీ,
ఇరాన్
నుంచి
ఎక్కువగా
ముడి
చమురును
దిగుమతి
చేసుకునేది.
అయితే
రష్యా
రాయితీ
ఇవ్వడంతో

దేశం
నుంచి
క్రూడ్
ఆయిల్
దిగుమతిని
పెంచింది.
అయితే
భారత
కంపెనీలు
రాయితీతో
ముడి
చమురును
దిగుమతి
చేసుకున్నా..
దేశీయంగా
మాత్రం
పెట్రోల్,
డీజిల్
ధరల
తగ్గడం
లేదు.

అయితే
ఇప్పటి
వరకు
నష్టాల్లో
ఉన్న
కంపెనీలు
రాయితీ
క్రూడ్
ఆయిల్
దిగుమతి
చేసుకోవడం
ద్వారా
లాభం
పొందుతున్నాయి.
త్వరలో
పెట్రోల్,
డీజిల్
ధరల
తగ్గించే
అవకాశం
ఉందని
ప్రభుత్వ
వర్గాలు
చెబుతున్నాయి.

English summary

India and China are importing heavy crude oil from Russia

The International Energy Agency (IEA) revealed on Friday that India and China bought 80 percent of the oil exported by Russia in May. “India increased purchases to 2 million barrels per day.

Story first published: Saturday, June 17, 2023, 14:33 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *