Dal Prices: పెరిగిపోతున్న పప్పుల ధరలు.. ఇకపై ఇంతకముందులా ఉండలేం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|


Dal
Prices:

దేశంలో
కూరగాయల
ధరలు
ఇప్పటికే
మండిపోతుంటే..
పప్పుధాన్యాల
ధరలు
అమాంతం
ఆకాశాన్ని
తాకే
పనిలో
కొనసాగుతున్నాయి.

ఏడాది
పప్పుల
ధరలు
దాదాపు
10
శాతానికిపైగా
పెరిగాయి.

వీటి
ధరలు
రానున్న
కాలంలో
మరింతగా
పెరుగుతాయని
వ్యాపారులు
చెబుతున్నారు.
అయితే
వీటి
ధరలను
అదుపులో
ఉంచేందుకు
ప్రభుత్వం
ఎన్ని
ప్రయత్నాలు
చేసినా
స్వల్పకాలంలో
పెంపుదల
ఆగడం
ఆందోళన
కలిగిస్తోంది.
రాయితీలను
కొనసాగించాలని
నిపుణులు
అంటున్నారు.
ప్రస్తుతం
ఇతర
దినుసుల
ధరలు
సైతం
పరుగుల
పందెంలోకి
వస్తున్నాయి.

పెరిగిపోతున్న పప్పుల ధరలు.. ఇకపై ఇంతకముందులా ఉండలేం..

వర్షాకాలంలో
కూరగాయల
ధరలు
పెరగడం
ఆనవాయితీగా
మారిపోయింది.
కానీ

ఏడాది
వాటితో
పాటు
అనేక
ఇతర
ఆహారాల
ధరలు
పెరగటం
గమనార్హం.
గడచిన
ఐదు
నెలల్లో
పప్పు
ధాన్యాల
ద్రవ్యోల్బణం
రెండింతలు
పెరిగిందని
రేటింగ్
ఏజెన్సీ
క్రిసిల్
వెల్లడించింది.
మే
నెలలో
టోకు
ధరల
సూచీ
పప్పుల
ద్రవ్యోల్బణం
5.8
శాతం,
సీపీఐ
6.6
శాతంగా
నమోదైంది.
అయితే
జూన్‌లో
సీపీఐ
పప్పుల
ద్రవ్యోల్బణం
10.58
శాతానికి
చేరుకుంది.

ఇదే
సమయంలో
బియ్యం
ధరలు
10
శాతం,
గోధుమల
ధరలు
12
శాతం
పెరగటంతో
సగటు
భారతీయుడు
మూడు
పూటలా
తినలేని
పరిస్థితి
నెలకొంది.
ఆహార
ద్రవ్యోల్బణం
బుట్టలో
పప్పుధాన్యాలకు
ఆరు
శాతం
వెయిటేజీ
ఉంటుంది.
ఇక్కడ
ఏవైనా
ధరలు
పెరిగితే
అది
గృహ
బడ్జెట్‌లను
ప్రభావితం
చేస్తుంది.
అయితే
ప్రస్తుతం
పప్పుల
ధరలను
నియంత్రించటంలో
చురుకుగా
ఉన్నట్లు
క్రిసిల్‌
చీఫ్
ఎకనామిస్ట్
డికె
జోషి
అభిప్రాయపడ్డారు.
పప్పు
ధాన్యాల
కొనుగోలు,
దిగుమతులపై
కేంద్రం
దృష్టి
సారించింది.

దేశంలోని
పల్స్
స్టోరీకి
వస్తే..
పంజాబ్,
హర్యానా,
పశ్చిమ
యూపీ,
కోస్టల్
అండ్
తూర్పు
కర్ణాటక,
మహారాష్ట్రలోని
కొన్ని
ప్రాంతాలలో
పప్పుధాన్యాలను
పండిస్తారు.
ఇదే
సమయంలో
మయన్మార్,
కెనడా
వంటి
దేశాల
నుంచి
ఇండియా
భారీ
మెుత్తంలో
దిగుమతులను
సైతం
చేసుకుంటుంది.
ఇలాంటి
తరుణంలో
జాతీయ
ఆహార
భద్రతా
మిషన్
పప్పుధాన్యాల
ఉత్పత్తిపై
అధికంగా
దృష్టి
సారించింది.
అలాగే
పప్పుధాన్యాలపై
దిగుమతి
పరిమితులను
తొలగించడం,
వ్యవసాయోత్పత్తి
మార్కెట్
కమిటీ
చట్టాల
నుంచి
పప్పులను
తొలగించడం
వంటివి
జరిగాయి.

English summary

Wheat, dal, rice prices soaring high along with vegetables prices, know in detail

Wheat, dal, rice prices soaring high along with vegetables prices, know in detail..

Story first published: Friday, July 14, 2023, 10:22 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *