Deficit: భారీగా తగ్గిన కరెంట్ ఖాతా లోటు.. 2022 Q2తో పోలిస్తే Q3లో ఏకంగా..

[ad_1]

News

lekhaka-Bhusarapu Pavani

|

Deficit: కరోనా అనంతర ఆర్థిక మందగమనం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎగుమతి & దిగుమతుల్లో ఏర్పడిన అంతరాయం వల్ల భారత కరెంట్ ఖాతా లోటు (CAD) విపరీతంగా పెరిగింది. ముడి చమురు ఇంపోర్ట్స్, సాఫ్ట్ వేరు సహా వివిధ రంగాల్లో పెరిగిన ఎక్స్ పోర్ట్స్ వల్ల లోటు కొంత తగ్గుముఖం పట్టినట్లు RBI తెలిపింది. గత త్రైమాసికంతో పోలిస్తే భారీగా పడిపోయినట్లు వెల్లడించింది.

అక్టోబర్-డిసెంబర్ మధ్య దేశ కరెంట్ ఖాతా లోటు చెప్పుకోదగ్గ స్థాయిలో తగ్గినట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. జూలై-సెప్టెంబర్‌లో నమోదైన 3.7 శాతం, 2021లో అక్టోబర్-డిసెంబర్ లోని 2.7 శాతంతో పోలిస్తే భారీగా పడిపోయినట్లు చెప్పింది. 2022 డిసెంబరుతో ముగిసిన క్వార్టర్‌లో CAD 2.2 శాతంగా ఉన్నట్లు RBI మార్చి 31న వివరించింది.

Deficit: భారీగా తగ్గిన కరెంట్ ఖాతా లోటు..

దేశీయ కరెంట్ ఖాతా లోటు అక్టోబర్-డిసెంబర్ కాలంలో 18.2 బిలియన్ డాలర్లకు తగ్గినట్లు RBI డేటా చెబుతోంది. జూలై-సెప్టెంబర్ కు సంబంధించి సవరించిన 30.9 బిలియన్ డాలర్ల కంటే ఇది చాలా తక్కువేనని తెలిపింది. అంతర్జాతీయంగా కమోడిటీ ధరల్లో ఏర్పడిన గణనీయమైన పెరుగుదల వల్ల భారత CADలో క్షీణత ఏర్పడినట్లు సెంట్రల్ బ్యాంకు పేర్కొంది.

2022-23 Q2తో పోలిస్తే Q3లో కరెంట్ ఖాతా లోటు తగ్గడంతో వాణిజ్యలోటు 78.3 బిలియన్ డాలర్ల నుంచి 72.7 బిలియన్లకు పడిపోయిందని రిజర్వు బ్యాంకు వెల్లడించింది. బలమైన సేవల రంగం మరియు ప్రైవేట్ బదిలీ రసీదులు కలిసి CAD తగ్గుదలలో కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది. చమురు దిగుమతుల్లో అగ్రగామిగా ఉన్న ఇండియా కరెంట్ ఖాతా లోటు విషయంలో ఈ ఉత్పత్తుల ధర కీలక అంశం. కాగా గత త్రైమాసికంలో బ్యారెల్‌ కు 97.9 డాలర్లుగా ఉన్న ముడిచమురు బాస్కెట్ ధర అక్టోబర్-డిసెంబర్ నాటికి 85.8కి పడిపోయినట్లు పెట్రోలియం ప్లానింగ్ & అనాలసిస్ సెల్ ప్రకటించింది.

English summary

India’s Current Account Deficit declined noticeably in December ended Q3

RBI announcement on Current Account Deficit

Story first published: Saturday, April 1, 2023, 7:11 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *