Dell layoffs: US టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. మరోసారి వేల ఉద్యోగుల తొలగింపు..

[ad_1]

 డెల్ టెక్నాలజీస్..

డెల్ టెక్నాలజీస్..

యూఎస్ టెక్ సంస్థ డెల్ టెక్నాలజీస్ తన మెుత్తం గ్లోబల్ ఉద్యోగుల్లో 5 శాతం మందిని తగ్గించాలని నిర్ణయించినట్లు కంపెనీ సీనియర్ వెల్లడించారు. తాజాగా కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం కింద ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ దాదాపుగా 6,650 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడైంది. రానున్న కాలంలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతాయని కంపెనీ అంచనా వేస్తున్న తరుణంలో ఈ నిర్ణయం వెలువడింది.

ఆపరేటింగ్ ఆఫీసర్..

ఆపరేటింగ్ ఆఫీసర్..

కంపెనీ కో-ఛీప్ ఆపరేటింగ్ ఆఫీసర్ జఫ్ క్లెర్క్ ఉద్యోగులకు పంపిన మెమోలో అనిశ్చిత పరిస్థితుల గురించి ప్రస్థావించారు. డిపార్ట్‌మెంట్ పునర్వ్యవస్థీకరణలు, ఉద్యోగాల కోతలు సామర్థ్యాన్ని పెంచడానికి ఒక అవకాశంగా కంపెనీ భావిస్తోంది. అమెరికాలో ఉద్యోగుల తొలగింపులు జనవరిలో రెండేళ్ల కంటే ఎక్కువ గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. మాంద్యం పరిస్థితులను ఎదుర్కొనేందుకు టెక్ కంపెనీలు రికార్డు స్థాయిలో వేగంగా ఉద్యోగులను తగ్గిస్తున్నాయి.

కొత్తగా 30,000 ఉద్యోగాలు..

కొత్తగా 30,000 ఉద్యోగాలు..

ప్రఖ్యాత అకౌంటింగ్ సేవల సంస్థ ప్రైస్‌వాటర్‌హౌస్‌కూపర్స్ తన సేవలను భారీగా విస్తరించాలని నిర్ణయించింది. రానున్న 5 ఏళ్ల కాలంలో 30,000 కొత్త ఉద్యోగాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కంపెనీ తన ఉద్యోగుల సంఖ్యను 50,000 నుంచి ఈ చర్య ద్వారా 80,000 లకు పెంచుకోవాలని చూస్తోంది. అనేక సంవత్సరాలుగా కంపెనీ ఇండియాలో తన వ్యాపారాన్ని క్రమంగా విస్తరిస్తూ పోతోంది.

2022లో విస్తరణ..

2022లో విస్తరణ..

కంపెనీ 2022లో దేశంలోని భువనేశ్వర్, జైపూర్, నోయిడాలో మూడు కొత్త కార్యాలయాలను ప్రారంభించింది. నైపుణ్యాలు కలిగిన స్థానిక ప్రతిభావంతుల నియామకంపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా క్లయింట్లు, వాటాదారుల పెరుగుతున్నందున.. అవసరాలకు అనుగుణంగా సంస్థ వ్యూహాత్మక పెట్టుబడులను కూడా చేస్తోంది.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *