Dengue Health Care: డెంగీ పేషెంట్స్‌ ఈ జ్యూస్‌ తాగితే.. ప్లెట్‌లెట్స్‌ కౌంట్‌ పెరుగుతుంది..!

[ad_1]

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

ఈ లక్షణాలు కనిపిస్తాయి..

శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గుదల తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. శరీరంలో ప్లేట్‌లెట్స్‌ తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

  • చర్మం మీద ఎర్రటి దద్దు. దురద కూడా ఉండొచ్చు. దద్దు సాధారణంగా ఛాతీ మీద మొదలై చేతులు, కాళ్లు, ముఖానికి వ్యాపిస్తుంది.
  • చిగుళ్ళలో రక్తస్రావం
  • పెటెచియా అని పిలిచే.. చిన్న ఎరుపు/ ఊదారంగు చుక్కలతో దద్దుర్లు
  • భారీ ఋతు రక్తస్రావం
  • గాయాల నుంచి రక్తస్రావం ఎక్కువగా అవ్వడం
  • మీ మూత్రంలో రక్తం
  • వాంతుల నుంచి రక్తం రావడం
  • మీ మలంలో రక్తం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.Thyroid Health: థైరాయిడ్‌ పేషెంట్స్‌ కచ్చితంగా తినాల్సిన.. అయోడిన్‌ రిచ్‌ ఫుడ్స్‌..!

సహజంగా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడం సాధ్యమేనా?

సహజంగా ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచడం సాధ్యమేనా?

డెంగీ వచ్చిన వ్యక్తులకు సహజంగా ప్లేట్‌లెట్‌ కౌంట్‌ను పెంచుకోవచ్చు. ప్లేట్‌లెట్ కౌంట్ 150,000 నుండి 400,000 పరిధిలో ఉండాలి. ప్లేట్‌లెట్ కౌంట్‌లో ఏదైనా తగ్గుదల భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. మీ డైట్‌లో విటమిన్ బి12, ఐరన్, ఫోలేట్, విటమిన్ సి, విటమిన్ కె సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోవడంపై దృష్టి పెట్టాలి.

ఈ చిట్కాలు పాటించండి..

ఈ చిట్కాలు పాటించండి..

బొప్పాయి ఆకు రసం: 4-5 బొప్పాయి ఆకులను నీటిలో మరిగించి మిశ్రమం తయారు చేసి త్రాగాలి.
గోధుమ గడ్డి రసం – ఒక కప్పు గోధుమ గడ్డి రసంలో కొంచెం నిమ్మరసం పిండుకుని తాగండి.
ఎండుద్రాక్ష – రాత్రంతా నీటిలో ఎండుద్రాక్షను నానబెట్టి ఉదయం తినండి.
మెంతి గింజల నీరు- ఒక టీస్పూన్ విత్తనాలను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టండి. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి, కొద్దిగా వేడి చేసి, త్రాగాలి.
కూరగాయల రసం– కలబంద రసం, బీట్‌రూట్ రసం, క్యారెట్ రసం మిశ్రమాన్ని సిద్ధం చేసి తాగండి.
గుమ్మడికాయ రసం – ఒక గ్లాస్‌ గుమ్మడికాయ రసంలో ఒక టీస్పూన్‌ తేనె మిక్స్‌ చేసుకుని తాగండి.
పాలకూర టమాటా రసం– తాజా పాలకూరను 4-5 ఆకులను తీసుకొని రెండు కప్పుల నీటిలో 2-3 నిమిషాలు ఉడకబెట్టండి. దీన్ని చల్లారనిచ్చి అర గ్లాసు టొమాటో రసంతో కలిపి తాగాలి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *