[ad_1]
కరివేపాకు..
కూరలోనో, చారులోనో కరివేపాకు రాగానే తీసి పక్కన పెట్టేసే కరివేపాకు.. షుగర్‌ను కంట్రోల్ ఉంచడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కాలేయానికి రక్షణ కల్పిస్తాయి. ఒక పరిశోధన ప్రకారం, కరివేపాకులో యాంటీ-హైపర్గ్లైసీమిక్ మూలకాలు అధిక మొత్తంలో ఉంటాయి, ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి. NCBI నివేదిక ప్రకారం, కరివేపాకు షుగర్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది. కరివేపాకులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని కంట్రోల్లో ఉంచుతుంది. కరివేపాకు ఇన్సులిన్‌ను పెంచడానికి కూడా సహాయపడుతుంది. షుగర్‌తో బాధపడే వారు కరివేపాకు రసం తాగాలని నిపుణులు అంటున్నారు. కరివేపాకు తిన్నా మంచిదే.
తులసి..
తులసిని ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. తులసి అనేక ఆరోగ్య సమస్య నుంచి రక్షణ ఇస్తుంది. తులసి వల్ల పాంక్రియాటిక్ బీటా కణాల పనితీరు, ఇన్సులిన్ స్రవించే విధానం మెరుగుపడుతుందని అధ్యయనాల్లో తేలింది. తులసి ఆకుల్లో హైపోగ్లైసిమిక్ లక్షణాలు ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. డయాబెటిస్‌ను కంట్రోల్లో ఉంచడానికి తులసి గొప్ప ఔషధంలా పనిచేస్తుందని జర్నల్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ బేస్డ్ కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అధ్యయనంలో పరిశోధకులు పేర్కొన్నారు. షుగర్ పేషెంట్స్ తులసి రసం తాగితే.. మంచిది.
ఇన్సులిన్ ఆకు..
ఇన్సులిన్ ఆకులో ప్రోటీన్, టెర్పెనాయిడ్లు, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు, ఆస్కార్బిక్ యాసిడ్, ఐరన్, బి-కెరోటిన్, కొరోసోలిక్ యాసిడ్ ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. ఇన్సులిన్ ఆకులో ఉండే..కొరోసోలిక్ యాసిడ్ ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ఎక్కువగా విడుదలయ్యేలా చేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడంలో బాగా పని చేస్తుంది. ఈ ఆకులో ఉన్న సహజ రసాయనం మానవ శరీరంలోని చక్కెరను గ్లైకోజెన్‌గా మారుస్తుంది. ప్రతి రోజూ ఇన్సులిన్ ఆకు తింటే.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఈ ఆకు రసం తాగినా మంచిదే.
మామిడి ఆకు..
మామిడి ఆకులలో మాంగిఫెరిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది ఆల్ఫా గ్లూకోసిడేస్ను నిరోధిస్తుంది. మాంగిఫైరిన్ ప్రేగులలో కార్బోహైడ్రేట్ జీవక్రియను తగ్గించడంలో సహాయపడుతుంది, రక్తంలో చక్కెర పెరుగుదలను నివారిస్తుంది. మామిడి ఆకులకు ఇన్సులిన్ని పెంచి గ్లూకోజ్‌ని నియంత్రించే శక్తి ఉంది. మామిడి ఆకులలో పెక్టిన్, విటమిన్ సి, ఫైబర్ కూడా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి, కొలెస్ట్రాల్ కరిగించడానికి సహాయపడతాయి. (image source – pixabay)
జామఆకు..
NCBIలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, జామ ఆకు రసం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. జామ ఆకు రసం ఆల్ఫా-గ్లూకోసిడేస్ చర్యను నిరోధించగలదని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇది స్టార్చ్, ఇతర కార్బోహైడ్రేట్లను గ్లూకోజ్‌గా విచ్ఛిన్నం చేసే ఎంజైమ్. మీరు జామ ఆకులతో టీ తయారు చేసుకుని కూడా తీసుకోవచ్చు. జామ ఆకుల రసంలో.. యాంటీ-హైపర్గ్లైసీమిక్ లక్షణాలు ఉన్నాయని కొన్ని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. వీటితో పాటు పాలీఫెనాల్స్, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్, టానిన్ కెమికల్స్ ఉంటాయి.(image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply