Elon Musk: మస్క్ మామకు బాయ్ చెప్తున్న ఇండియన్స్.. రఫ్ఫాడిస్తున్న టెస్లా ఇన్వెస్టర్లు..!

[ad_1]

 కార్యాలయాలు ఖాళీ..

కార్యాలయాలు ఖాళీ..

ఎలాన్ మస్క్ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అత్యంత కష్టమైన రూల్స్ తో ఉద్యోగులు బందీలుగా మారిపోయారు. అందుకే ట్విట్టర్ ఇండియా కార్యాలయం నుంచి చాలా మంది ఉద్యోగులు బయటకు వచ్చేశారు. మస్క్ రాకముందు దేశంలోని కార్యాలయంలో 250 మంది వరకు పనిచేసేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య దాదాపుగా 80కి తగ్గింది.

అక్టోబర్ మాసంలో..

అక్టోబర్ మాసంలో..

ఎలాన్ మస్క్ ఉద్యోగులకు ఇస్తున్న లక్ష్యాలను చేరుకోవటంతో పాటు కఠినమైన పని వేళలు, వాతావరణాన్ని ఎదుర్కోవటం కష్టతరంగా మారటంతో చాలా మంది భారతీయ కార్యాలయ ఉద్యోగులు కంపెనీని వీడుతున్నారు. దీనికి తోడు అక్టోబరులో కంపెనీని కొన్న తర్వాత ఢిల్లీ, బెంగళూరు, ముంబైలోని భారతీయ కార్యాలయాల నుంచి కనీసం 50 శాతం మంది ఉద్యోగులను ఎలాన్ మస్క్ తొలగించారు.

అమెరికా ప్రధాన కార్యాలయంలో ఉద్యోగులకు ఇస్తున్న ట్రీట్ మెంట్ భారత్ లోనూ అదే విధంగా ఉందని ఎలాన్ మస్క్ పేర్కొన్నప్పటికీ, శాన్ ఫ్రాన్సిస్కో ఉద్యోగులే ఎక్కువగా ప్రభావితమవుతున్నారని తెలుస్తోంది.

మండిపడుతున్న ఇన్వెస్టర్లు..

మండిపడుతున్న ఇన్వెస్టర్లు..

కొన్నాళ్లుగా బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ కొనుగోలుతో పాటు, టాక్సుల చెల్లిపుల కోసం టెస్లాలోని తన వాటాలను విక్రయిస్తున్నారు. అలాగే ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత ఆయన ఏకంగా శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలోనే నివసిస్తున్నారు. ఈ చర్యల వల్ల టెస్లా వృద్ధితో పాటు స్టాక్ ధరపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇన్వెస్టర్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

కోగ్వాన్ లియో..

కోగ్వాన్ లియో..

టెస్లాలో పెట్టుబడులు పెట్టిన కోగ్వాన్ లియో ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాలపై స్పందించారు. టెస్లా మేనేజ్‌మెంట్ బైబ్యాక్ ప్లాన్‌ను ప్రకటిస్తే, మార్కెట్‌లో టెస్లా షేర్లను తగ్గిస్తూ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నానని చైనా జాతీయుడు కోగ్వాన్ లియో ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అయితే ప్రస్తుతం మస్క్ టెస్లాపై ఫోకస్ తగ్గించి ట్విట్టర్ పై దృష్టి సారించటాన్ని చాలా మంది తప్పుపడుతున్నారు. అందుకే టెస్లాను చూసుకునేందుకు ఫుల్ టైం సీఈవో కావాలని చాలా మంది ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

టెస్లా ఇన్వెస్టర్ల జాబితా..

టెస్లా ఇన్వెస్టర్ల జాబితా..

ఎలాన్ మస్క్ – 13.4 శాతం

వాన్గార్డ్ గ్రూప్ – 6.8 శాతం

బ్లాక్‌రాక్ – 5.4 శాతం

స్టేట్ స్ట్రీట్ గ్లోబల్ అడ్వైజర్స్ – 3.2 శాతం

క్యాపిటల్ రీసెర్చ్ అండ్ మేనేజ్‌మెంట్ – 3.1 శాతం

జియోడ్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ – 1.5 శాతం

T.Rowe ప్రైస్ గ్రూప్ – 1.3 శాతం

లారీ ఎల్లిసన్ – 1.4 శాతం

జెన్నిసన్ అసోసియేట్స్ – 0.9 శాతం

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *