EPFO News: ఈ సారీ తక్కువే.. ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును ప్రకటించిన ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

EPFO News: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్(EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ మార్చి 28న ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్‌పై చెల్లించే వడ్డీ రేట్లను నిర్ణయించింది. బయట ద్రవ్యోల్బణం వల్ల వడ్డీరేట్ల పెంపు భారీగా జరుగుతున్నప్పటికీ ఉద్యోగుల భవిష్య నిధిలో పెట్టుబడులకు ఆ అవకాశం లభించలేదు. దీంతో చాలా మంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రి మంత్రి భూపేంద్ర యాదవ్‌ అధ్యక్షతన ఢిల్లీలో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీల 233వ సమావేశం జరిగింది. ఇందులో ఈ ఆర్థిక సంవత్సరానికి పొదుపుదారులకు 8.15 శాతం వడ్డీ రేటును చెల్లించాలని నిర్ణయించారు. 2021-22లో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సొమ్ముపై అత్యంత తక్కువైన 8.10 శాతాన్ని చెల్లించగా ఇప్పుడు కేవలం స్వల్ప మార్పుతో దానిని 8.15 శాతానికి పెంచారు. దీనికి ముందు 2010-11లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గరిష్ఠంగా 9.50 శాతం వడ్డీని ఉద్యోగులకు అందించటం జరిగింది.

EPFO News: ఈ సారీ తక్కువే.. ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును

గడచిన 17 సంవత్సరాల్లో ఇప్పుడు మోదీ సర్కార్ హయాంలో అత్యంత తక్కువ వడ్డీగా ప్రస్తుతం నిర్ణయించిన 8.15 శాతం వడ్డీ రేటు నిలిచింది. సభ్యులకు సంబంధించిన మెుత్తం రూ.11 లక్షల కోట్లకు గాను రూ.90,000 కోట్లను ఖాతాదారుల అకౌంట్లకు ట్రాన్ఫర్ చేయాలని బోర్డు ప్రతిపాధించింది. బోర్డు తీసుకున్న ఈ నిర్ణయం దాదాపు 6 కోట్ల ఈపీఎఫ్ఓ ఖాతాదారులను ప్రభావితం చేయనుంది.

EPFO 2021-22 ఆర్థిక సంవత్సరానికి 8.10 శాతం వడ్డీ రేటును ప్రకటించింది. ఇది నాలుగు దశాబ్దాలలో అతి తక్కువ వడ్డీ రేటు చెల్లింపుగా నిలిచింది. దీనికి ముందు చివరిసారిగా 1977-78లో వడ్డీ రేటు 8 శాతానికి పడిపోయింది. ఇది EPFOకి రూ.450 కోట్ల మిగులును మిగిల్చింది. 2022లో చాలా మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ ఆలస్యంగా జమ అయ్యింది. EPFకి అధిక విరాళాలపై వడ్డీని పన్ను విధించాలని కేంద్ర బడ్జెట్ ప్రతిపాదించిన మొదటి సంవత్సరం కూడా ఇదే కావటం గమనార్హం.

English summary

EPFO trustee board decided interest rate as 8.15 percent for FY 2022-23, Disappointed employees

EPFO trustees board descided interest rate as 8.15 percent for FY 2022-23, Dissapointed employees

Story first published: Tuesday, March 28, 2023, 14:09 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *