EV: భూలోక స్వర్గంలో భారీగా లిథియం నిల్వలు.. ప్రపంచంలో భారత్ స్థానం ఎంతంటే..

[ad_1]

భారీ నిల్వలు

భారీ నిల్వలు

జమ్మూ కాశ్మీర్‌ లో పెద్ద ఎత్తున లిథియం నిల్వలను కనుగొన్నట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. 5.9 మిలియన్ టన్నుల మేర ఉండవచ్చని పేర్కొంది. కాగా ఇప్పటివరకు భారత్‌ లో కనుగొన్న లిథియం నిల్వల్లో ఇదే అతి పెద్దది కావడం విశేషం. తద్వారా EV రంగంలో ప్రపంచంతో ఇండియా పోటీపడగలదని నిపుణులు భావిస్తున్నారు. ఈ అరుదైన ఖనిజాన్ని ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీల తయారీలో వినియోగిస్తారు.

స్వయం సమృద్ధి దిశగా..

స్వయం సమృద్ధి దిశగా..

భారత లిథియం అవసరాల్లో 70 శాతం చైనా, హాంకాంగ్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు గ్రీన్‌ఫ్యూయల్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కశ్యప్ తెలిపారు. జమ్మూ, కాశ్మీర్‌ లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) కనుగొన్న లిథియం నిల్వలు భారత్‌ కు అత్యంత కీలకమైనవన్నారు. వీటిని సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే, ఈ విషయంలో స్వయం సమృద్ధి సాధించవచ్చన్నారు.

ఆత్మనిర్భర భారత్ సాధనకు..

ఆత్మనిర్భర భారత్ సాధనకు..

ప్రస్తుతం 1 శాతంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని 2030 నాటికి 30 శాతానికి తీసుకెళ్లాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. 2070 నాటికి జీరో ఉద్గారాలను చేరుకోవడమే పరమావధిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో EVలు, బ్యాటరీల్లో వినియోగించే లిథియం కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటే నిజమైన ఆత్మనిర్భర భారత్ సాధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచంలో రెండో స్థానం

ప్రపంచంలోనే అత్యధికంగా 9.2 మిలియన్ టన్నులు లిథియం నిల్వలు చిలీలో ఉన్నాయి. తర్వాత ఆస్ట్రేలియాలో 5.7 మిలియన్లు, చైనాలో 1.5 మిలియన్లు, బ్రెజిల్ లో 95 వేలు, పోర్చుగల్ లో 66 వేల టన్నులు ఉన్నట్లు అంచనా. భారత్‌ లో తాజాగా బయటపడిన 5.9 మిలియన్ టన్నులను బట్టి చూస్తే మనం రెండో స్థానంలో ఉన్నట్టే.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *