[ad_1]
Aboubakar scoring in the 92nd minute to beat Brazil and taking his shirt off for his second yellow for vibes 😭👏 #FIFAWorldCup pic.twitter.com/vHM8bbmbmm
— JAMODO (@JamieODoherty) December 2, 2022
సెకండాఫ్‌లోనూ అదే తీరు. దీంతో మ్యాచ్ పేలవమైన గోల్‌లెస్ డ్రాకు దారితీస్తుండగా.. స్టాపేజ్ టేమ్‌లో సబ్‌స్టిట్యూట్ ఆటగాడు జిరోమ్ ఎన్‌గామ్ కొట్టిన క్రాస్‌ను అబూబాకర్ హెడర్‌తో గోల్‌లోకి పంపి.. కామెరూన్‌ను 1-0తో గెలిపించాడు. అయితే, గోల్ కొట్టిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా అబూబాకర్ జెర్సీని తీసేసి సంబరాలు చేసుకోవడంతో రెఫరీ ఎల్లోకార్డు చూపించాడు. అంతకుముందే ఎల్లో కార్డు పొందడంతో అతడు రెడ్‌కార్డుగా మైదానం వీడాడు.
2002 తర్వాత విశ్వకప్‌లో కామెరూన్‌కిదే తొలి విజయం. కాగా, మెగా ఈవెంట్‌లో బ్రెజిల్‌ను ఓడించిన తొలి ఆఫ్రికా జట్టుగా కామెరూన్ రికార్డులకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఓడినా మొత్తం 6 పాయింట్లతో గ్రూప్ విన్నర్‌గా నిలిచిన బ్రెజిల్.. ప్రీక్వార్టర్స్‌లో దక్షిణ కొరియాతో తలపడనుంది. 4 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన కామెరూన్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచకప్‌లో స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో కుడి చీలమండ గాయంతో జట్టుకు దూరమైన నెయ్‌మార్.. కామెరూన్‌తో పోరుకు మైదానంలోకి వచ్చాడు. మ్యాచ్‌కు ముందు సహచరులు సాధన చేస్తుంటే అతనూ బంతితో ఆడాడు. అనంతరం జట్టు డగౌట్ వెనకాల స్టాండ్స్‌లో కూర్చుని మ్యాచ్ వీక్షించాడు. ఆ గాయం కారణంగా గ్రూప్ దశ మ్యాచ్‌లకు దూరమైన అతను త్వరలోనే తిరిగి మైదానంలో పరుగులు పెట్టే అవకాశముంది. మరోవైపు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన దిగ్గజం పీలేకు మద్దతుగా బ్రెజిల్ అభిమానులు బ్యానర్లు ప్రదర్శించారు.
[ad_2]
Source link
Leave a Reply