Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9% వడ్డీ అందిస్తున్న రెండు బ్యాంకులు.. పూర్తి వివరాలు..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Fixed Deposits: రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును పెంచిన తర్వాత దేశంలోని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు తమ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అందిస్తున్న వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. గత కొన్ని రోజులుగా చాలా బ్యాంకులు FDలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్ సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడుతున్న తరుణంలో బ్యాంకులు భారీగా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఈ క్రమంలో 9 శాతం వడ్డీ రేటును అందిస్తున్న రెండు బ్యాంకుల గురించి ఇప్పుడే తెలుసుకోండి..

ఆర్బీఐ రేటు పెంపు తర్వాత సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజా వడ్డీ రేట్లు డిసెంబర్ 6 నుంచి అమలులోకి వచ్చాయి. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సామాన్యులకు 9.01 శాతం, సీనియర్ సిటిజన్లకు 9.26 శాతం వడ్డీని బ్యాంక్ గరిష్ఠంగా ఆఫర్ చేస్తోంది. ఈ రేట్లు 15 రోజుల నుంచి 5 ఏళ్ల కాలానికి సంబంధించిన డిపాజిట్లపై అందుబాటులో ఉన్నాయి.

Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 9% వడ్డీ అందిస్తున్న ర

యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తాజాగా పెంచింది. బ్యాంక్ FDలపై సీనియర్ సిటిజన్లకు 4.5 శాతం నుంచు 9 శాతం వరకు వడ్డీ రేట్లను బ్యాంక్ అందిస్తోంది.ఇది ప్రస్తుతం సీనియర్ సిటిజన్‌లకు వరుసగా 181-501 రోజుల FDలపై 9 శాతం వడ్డీని అందిస్తోంది. సీనియర్ సిటిజన్లు కాకుండా ఇతర వయస్కులకు 181 రోజుల్లో మెచ్యూర్ అయ్యే FDలపై 8.50 శాతం వడ్డీని బ్యాంక్ అందిస్తోంది.

English summary

Know banks that offering 9 percent interest rate on bank fixed deposit

Know banks that offering 9 percent interest rate on bank fixed deposit

Story first published: Sunday, December 18, 2022, 16:00 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *