[ad_1]
Nifty Bank F&O Expiry Change: ప్రస్తుతం, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కాంట్రాక్ట్ శుక్రవారం ప్రారంభమై గురువారం ముగుస్తుంది. మళ్లీ శుక్రవారం నుంచి కొత్త కాంట్రాక్ట్ ప్రారంభం అవుతుంది. అయితే, గురువారం ఎక్స్పైరీ ఇక చరిత్రగా మిగలబోతోంది.
నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) ముగింపు రోజును (expiry) గురువారం నుంచి శుక్రవారానికి మారుస్తున్నట్లు భారతదేశపు అతి పెద్ద డెరివేటివ్ బోర్స్ ‘నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా’ (NSE) ప్రకటించింది. కొత్త నిబంధన జులై 14 నుంచి అమల్లోకి వస్తుంది.
“జులై 7, 2023 (శుక్రవారం) నుంచి ప్రారంభమయ్యే కాంట్రాక్ట్‌లకు కొత్త ఎక్స్పైరీ అమలులోకి వస్తుంది. దీనికి అనుగుణంగా, గురువారం (జులై 6) గడువుతో ఉన్న అన్ని కాంట్రాక్ట్‌ల గడువు శుక్రవారానికి మారుతుంది. జులై 6న, మార్కెట్ ముగింపు సమయంలో ఈ మార్పు జరుగుతుంది. జులై 13తో (గురువారం) మెచ్యూర్ అయ్యే కాంట్రాక్టులన్నీ శుక్రవారం నాడు (జులై 14, 2023) ముగుస్తాయి” అని తన సర్క్యులర్‌లో NSE తెలిపింది.
ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కాంట్రాక్ట్ ప్రతి గురువారం రోజున; మంత్లీ, క్వార్టర్లీ కాంట్రాక్స్లు సంబంధిత నెలలో చివరి గురువారం రోజున ముగుస్తున్నాయి.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: అప్పు తీర్చిన అదానీ, షేర్ ప్రైస్‌లో స్మార్ట్ రియాక్షన్
జులై 7 నుంచి, బ్యాంక్ నిఫ్టీ వీక్లీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ శుక్రవారానికి మారుతుంది. ఒకవేళ శుక్రవారం నాడు స్టాక్ మార్కెట్లకు సెలవు వస్తే, దానికి ముందున్న ట్రేడింగ్ రోజున కాంట్రాక్ట్ ముగుస్తుంది. అంటే, శుక్రవారం సెలవు వస్తే ఆ కాంట్రాక్ట్ గురువారమే ముగుస్తుంది. ఒకవేళ శుక్రవారం, గురువారం కూడా సెలవులు ఉంటే, బుధవారం నాడు ట్రేడింగ్ ముగుస్తుంది. జులైతో ముగిసే మంత్లీ, క్వార్టర్లీ కాంట్రాక్ట్‌ల విషయంలోనూ ఇదే వర్తిస్తుంది.
ఈ ప్రకారం, జులై 7 తర్వాత వచ్చే తొలి వీక్లీ, మంత్లీ, క్వార్టర్లీ కాంట్రాక్ట్‌ల ఎక్స్పైరీకి ఒకరోజు అదనంగా కలుస్తుంది. దీనివల్ల ఆ కాంట్రాక్ట్‌ల ప్రీమియం డికేలో వేగం తగ్గుతుంది. కాబట్టి, నిఫ్టీ బ్యాంక్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడర్లు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్ట్స్ తీసుకోవాలి. లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది.
క్లియరింగ్ కార్పొరేషన్లు కొత్త ఎక్స్పైరీ ప్రకారం సెటిల్మెంట్ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తాయి.
మరో ఇంట్రెస్టింగ్ స్టోరీ: పసిడికి డిమాండ్ – ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply